Pawan Kalyan-Allu Arjun: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో ఈ సినిమాను చూడడానికి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాటు వచ్చాడు. ఈ తరుణంలో ఊహించిన విధంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. దీనిలో రేవతి అని ఒక మహిళ మరణించారు. తన కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్ లో ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా తరలించారు. అయితే అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించడం వలన ఒక రోజులోనే బయటకు వచ్చాడు. ఈ తరుణంలో చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అల్లు అర్జున్ పరామర్శించారు. ఇక్కడితో ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. అల్లు అర్జున్ కు కాలుపోయిందా, కన్ను పోయిందా అంతమంది పరామర్శించారు అంటూ అసెంబ్లీలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. అయితే చాలామంది సెలబ్రిటీలు మాట్లాడిన తరుణంలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వలేదని కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వీటన్నిటి పైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోటితో పోయే విషయం గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.తన సినిమాను ప్రజలు ఎలా ఎంజాయ్ చేస్తున్ననారో తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. దానిలో తప్పులేదు.ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవటం భాధాకరం, సంఘటన జరిగిన విషయం ఆయన సిబ్బంది వెంటనే చెప్పి ఉండాలి. సంఘటన జరిగిన మరుసటి రోజు హీరోకాకపోయినా సినిమా టీం, డైరెక్టర్, నిర్మాత ఎవరో ఒక్కరు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించాల్సింది. కనీసం దేవాలయాల్లో బాబుకోల్కోవాలని పూజలు చెయ్యాల్సింది. అలా జరగలేదు..
కొన్ని సార్లు మనం తప్పు చెయ్యకపోయినా పరిస్థితుల ప్రభావంతో సారీ చెప్పాలి.. నేను నా అభిమానులు బ్యానర్లు కడుతూ చనిపోయిన సంఘటన లో నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళను ఓదార్చాను. కొన్నిసార్లు తిట్లు తిన్నాను.
పాపం అందరూ కలిసి అల్లూ అర్జున్ ని కార్నర్ చేసేసారు. ఇక్కడ సినిమా యూనిట్ మొత్తం భాద్యత తీసుకోవాలి అలాజరగకుండా కేవలం హీరోని మాత్రమే టార్గెట్ చేసారు. సినిమా నిర్మాతలు ఇంకా బాగా స్పందించాల్సి ఉంది. వెళ్ళిపోయెప్పుడు అల్లు అర్జున్ అభివాదం చేయకపోతే
అది వేరేలా అర్దం చేసుకుంటారు.. హీరోలు రాజకీయ నాయకులు వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు అభివాదం చేయడం సహజం. అంటూ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు. ఒక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై మంచి ప్రశంసలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Naga Chaitanya – Shobhita: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసిన కొత్తజంట.. మరీ ఇలా అయితే ఎలా గురూ..!