BigTV English

CM Chandrababu: ఏపీకి ఇది గేమ్ ఛేంజర్ అవుతోంది.. మీరే చూడండి: సీఎం చంద్రాబు

CM Chandrababu: ఏపీకి ఇది గేమ్ ఛేంజర్ అవుతోంది.. మీరే చూడండి: సీఎం చంద్రాబు

CM Chandrababu: నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో.. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. నదుల అనుసంధానం చేస్తేనే రాష్ట్రానికి ఉపయోగమని అన్నారు. 90శాతం ప్రాజెక్టులను రాష్ట్రంలో టీడీపీనే ప్రారంభించిందని చెప్పారు. తెలుగుగంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీ దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు లేకపోవడం వల్ల.. ఉత్తరాంధ్రలో నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. ఏపీని కరవు రహితంగా మారుస్తామని సీఎం తెలిపారు.


చరిత్ర చూసుకుంటే, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలోనే నీటి భద్రతకు అడుగులు పడ్డాయని అన్నారు. తెలుగు గంగతో అన్న ఎన్టీఆర్ రాయలసీమని ఆదుకున్నారని.. సాగునీరు అందిస్తే, రాయలసీమ రతనాలసీమ అవుతుందని అన్నారు.  ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయని.. ప్రణాళికతో నీటిని స్టోరేజ్ చేశామని చెప్పారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 74% నీళ్ళు ఉన్నాయి. జనవరి నెలలో ఇంత నీరు ఉండటం ఓ చరిత్ర. తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇచ్చింది టీడీపీనే. ఏపీని కరువు రహిత ప్రాంతంగా చేంజ్ చేస్తాం. ఏపీని కరువు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలో తెలుగంగ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్.. పట్టిసీమ వచ్చిన తర్వాత పంటలకు కృష్ణా నీళ్ళు తగ్గాయి.. గోదావరి నీరు వస్తున్నాయి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: KTR News: నాపై రేవంత్ రెడ్డి పెద్ద ప్లానే వేశాడు.. అయినప్పటికీ..?


నదుల అనుసంధానం తోనే పంటలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. ఏటా గోదావరి వరద పెరుగుతుంది.. కానీ కృష్ణకు వరద తగ్గుతుందని అన్నారు. మూడు దశల్లో బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయగలిగితే కరువు ఉండదని చెప్పుకొచ్చారు.  ‘ఏపీని కరువు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. గోదావరిలో 200 టీఎంసీలు వరద జలాలను తరలించేలా ప్రణాళిక రచిస్తున్నాం. పోలవరం నుంచి నదుల అనుసంధానం చేస్తాం. పోలవరం లెఫ్ట్ కెనాల్‌ను నాగవల్లి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఈ ఏడాది 4114 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. సగటును 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళుతున్నాయి’ అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×