Pawan Kalyan Vs Balayya: ఇప్పుడు సినిమాల మీద ఆసక్తి కొద్దిగా తగ్గింది కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు సినిమాలు మీద ఉన్న డెడికేషన్ వేరు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బీభత్సమైన అంచనాలు ఉండేవి. బుక్ మై షో వంటి యాప్స్ వచ్చిన తర్వాత సినిమా టిక్కెట్లు దొరకడం చాలా ఈజీ అయిపోయింది. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు టికెట్ దొరకాలి అంటేనే అది ఒక అచీవ్మెంట్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. సినిమా రేపు రిలీజ్ అవుతుంది అంటే ముందు రోజు రాత్రి నుంచి టికెట్ క్యూలో నిలుచునే వాళ్ళు. అయినా కూడా టికెట్ దొరుకుతుంది అనే నమ్మకాలు లేవు. ఫస్ట్ షో టికెట్ కోసం చాలామందిని రికమెండ్ చేయాల్సి వచ్చేది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న కూడా ఒక వైబ్ లేకుండా పోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు పోటీ పడడం కామన్ గా జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాలు పోటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న అఖండ 2 సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇదివరకు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. అన్ని పోటీల్లోనూ పవన్ కళ్యాణ్ ది పై చేయి అని చెప్పాలి. ఇప్పుడు కూడా అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడం చాలా మంచిది అని కొంతమంది అభిప్రాయం.
పవన్ కళ్యాణ్ సినిమాలు ముందంజ
బాలకృష్ణ నటించిన సుల్తాన్ సినిమా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఒకేసారి విడుదలయ్యాయి. తమ్ముడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే బంగారం, వీరభద్ర సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మాత్రం హైయెస్ట్ కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ బంగారం సినిమా పెట్టింది. అజ్ఞాతవాసి, జై సింహ సినిమాలు సంక్రాంతి కానుక విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఊహించిన సక్సెస్ కాలేదు కానీ అజ్ఞాతవాసికి కొద్దిపాటి మెరుగు కలెక్షన్స్ వచ్చాయి. అయితే మరోవైపు బాలకృష్ణ అఖండ 2 సినిమా డిసెంబర్ మొదటి వారానికి వాయిదా పడుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : Sree Vishnu : శ్రీ విష్ణు ముందు… అప్పట్లోనే సినిమాల్లో బూతులు వాడిన నటుడు ఎవరో తెలుసా ?