BigTV English

Pawan Kalyan: ధ‌నుష్ గెస్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చ‌ర్చ‌ల్లో మేక‌ర్స్‌!

Pawan Kalyan: ధ‌నుష్ గెస్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చ‌ర్చ‌ల్లో మేక‌ర్స్‌!
Pawan Kalyan

కోలీవుడ్ స్టార్స్ ధ‌నుష్‌, ద‌ళ‌ప‌తి విజ‌య్‌, అజిత్ వంటి వారు ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేశారు. అందుక‌నే వారి సినిమాల‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. విజ‌య్‌, ధ‌నుష్ వంటి వాళ్లైతే ఏకంగా తెలుగు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేస్తున్నారు. ఆ కోవ‌లో ధ‌నుష్ హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రం ‘సార్’ (తమిళంలో వాత్తి). ఫిబ్రవరి 17న మూవీ రిలీజ్ కానుంది. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌తో పాటు ఫార్చ్యూన్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ, సాయి సౌజ‌న్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేయ‌టానికి మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో జోరు పెంచారు.


అందులో భాగంగా సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించ‌టానికి ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినినిప‌స్తున్నాయి. నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో భీమ్లా నాయ‌క్ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఫార్చ్యూన్ సినిమా త్రివిక్ర‌మ్ బ్యాన‌ర్‌. కావ‌టంతో త్రివిక్ర‌మ్ ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆహ్వానించే ప్లాన్ జ‌రుగుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను నిజంగానే ఆహ్వానిస్తారా? లేక రూమ‌ర్ మాత్ర‌మేనా అనేది తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగాల్సిందే.

సార్ సినిమాలో ధ‌నుష్‌కి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించింది. ప్రైవేటీక‌ర‌ణ‌తో పాడ‌వుతున్న‌ విద్యా వ్య‌వ‌స్థ‌పై ఓ యువ‌కుడు ఎలా పోరాటం చేశాడ‌నేదే సినిమా క‌థాంశం. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జీవీ ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ సాధిస్తారోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×