Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ఈ నెల 8 న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద నుంచి బయటపడ్డ మార్క్ ను శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
పవన్ కళ్యాణ్ కొడుక్కు అగ్ని ప్రమాదం..
డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు. అతడి కోసం లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓ వైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్ మాత్రం సింగపూర్ వెళ్లలేదు. తన భార్య కొడుకు వెళ్లారు. ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా… సింగపూర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ కు బయలు దేరారు. అక్కడ కొడుకు ఆరోగ్యం బాగా అయిన తరువాత తిరిగి మళ్లీ ఇండియకు వచ్చేసారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా… అగ్ని కీలక నేపథ్యంలో ఎగసిన పొగలను పీల్చిన మార్క్.. శ్వాస సంబంధిత సమస్యతో ఒకింత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మార్క్ నిన్న ఇండియాకు తీసుకొని వచ్చారు పవన్ దంపతులు..
Also Read :ఆ బాధతోనే తప్పుడు పని చేశా.. తాగుడుకు బానిసయ్యాను..
మార్క్ ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు అయ్యిందంటే..?
మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాళ్లు, చేతులు గాయాలతో పాటు.. ఆయన ఊపిరితిత్తుల్లో పొగ చేరిపోవడంతో అత్యవసర విభాగంలో చర్చి స్పెషల్ ట్రీట్మెంట్ను అందించారు. ఐసియూ లో మూడు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అతనికి అత్యవసర ట్రీట్మెంట్ ను అందించారు. బ్రోన్కోస్కోపి ట్రీట్మెంట్ తో మార్క్స్ శంకర్ కి నయమైంది. ఇక ఈ ట్రీట్మెంట్ కోసం ఎన్నో లక్షలు ఖర్చు చేసి ఉంటారని అంతా అభిప్రాయాలను వ్యక్తం చేశారు.. ప్రమాదం జరిగిన 30 నిమిషాలలోపే చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని.. నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి క్రమంలోనే ట్రీట్మెంట్ కు లక్షల్లో ఖర్చు అవుతుందని టాక్. కానీ అక్కడ ట్రీట్మెంట్ కు కేవలం 30 వేల వరకు ఖర్చు అయ్యిందని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఏది ఏమైనా ఇంత పెద్ద ప్రమాదం జరగడం, మళ్లీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరగడం మళ్లీ కోలుకోవడం అంత సడెన్ గా జరిగిపోయింది. మొత్తానికి మార్క్ శంకర్ బయట పడటంతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..