BigTV English

Arjun son of Vyjayanthi: సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్.. ఆ 20 నిమిషాల కోసమైనా సినిమా చూడాల్సిందే భయ్యా..!

Arjun son of Vyjayanthi: సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్.. ఆ 20 నిమిషాల కోసమైనా సినిమా చూడాల్సిందే భయ్యా..!

Arjun son of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న సినిమా అర్జున్ S/O వైజయంతి. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ సునీల్ బలుసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయశాంతి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన సినిమా థియేటర్లో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది..


తాజాగా అర్జున్ S/O వైజయంతి సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ ను పొందింది. 149 నిమిషాల 50 సెకండ్స్ నివిడి గల రన్ టైమ్ ని లాక్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకి రానుంది. సెన్సార్ పూర్తిచేసుకుని రన్ టైం లాక్ చేసిన పోస్టర్ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేశారు.

సెకండ్ హాఫ్ లో ఏడ్చే బయటకు వస్తారన్న తారక్..


అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా నేను చూశానని.. సినిమా చాలా అంటే చాలా బాగుందని.. నందమూరి కళ్యాణ్ రామ్, వైజయంతి, ఆమె కొడుకు ఈ సినిమాలో బాగా నటించారని.. అంతేకాకుండా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాగా నటించారని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆఖరి 20 నిమిషాలు అంటే సెకండ్ హాఫ్ కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకోవడమే కాకుండా.. కచ్చితంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏడ్చే బయటకు వస్తారు అనే హింటునైతే తారక్ రివిల్ చేశారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్లో చూడమని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో పాటు సినీ అభిమానులను కూడా కోరారు.

ఈ సినిమా కథ ముందే చెప్పేసిన కళ్యాణ్ రామ్..

కళ్యాణ్ రామ్ ఈ సినిమా కథ గురించి ముందే చెప్పారు. ప్రతి ఇంట్లో తల్లి మనసు కి హద్దుకునే విధంగా ఉంటుంది. తల్లి తన ప్రాణాన్నిపణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అడుగు అమ్మ చేయి పట్టుకొని నడిపించిందే, మన కోసం ఎన్నో త్యాగాలు చేసినా అమ్మ కోసం, మనం ఎంత బాధ్యతగా ఉండాలి అని చెప్పే కథే ఈ అర్జున్ S/O వైజయంతి అని తెలిపారు. వేసవి కానుకగా ఈ సినిమా ఈనెల 18వ తేదీన థియేటర్లో సందడి చేయనుంది. సినిమాలో బలమైన ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, టాలీవుడ్ లో ఇలాంటి క్లైమాక్స్ మీరు ఎప్పుడూ చూసి ఉండరని హీరో కళ్యాణ్ రామ్ సైతం కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ లో మాట్లాడిన మాటలతో ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న అంచనాలతో పాటు తారక్ కూడా ఈ సినిమా అంచనాలను పెంచేశారు. ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

 

Ramakrishna: 26 ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం అక్కడికి వెళ్ళిన రమ్యకృష్ణ..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×