Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులను దృష్టిలో ఉంచుకొని బుధవారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం అండదండగా నిలవాలన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో పలువురు రైతులకు నగదు జమ కాగా, రెండవ దఫా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో దఫా నిధులను కూడ ప్రభుత్వం విడుదల చేసింది.
సాగులో ఉన్న రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 26 తేదీన ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, ఏడాదికి అర్హులైన రైతులందరికీ రూ. 12 వేలు ప్రభుత్వం అందిస్తోంది. అయితే రెండు విడతలుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే పలువురు రైతులకు రూ. 6 వేలు నగదు ఖాతాలో పడింది. ప్రభుత్వం రైతన్నల పక్షాన నిలుస్తూ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్.. పేరుకే స్కీములు ప్రవేశపెడుతున్నారని విమర్శలు గుప్పించింది. దీనితో ప్రభుత్వం రైతులకు జమ వివరాలను కూడా ప్రజల ముందు ఉంచగా.. బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. తాజాగా ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది.
Also Read: కొడుకులే వారసులు అవుతారా.. మరి ఉపాసన? మెగాస్టార్ కు శ్యామల సూటి ప్రశ్న
ఇప్పటికే ఎకరా భూమి సాగులో ఉన్న రైతులకు నగదు జమ చేసిన ప్రభుత్వం, ఇటీవల రెండెకరాల లోపు సాగు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేసింది. బుధవారం మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నట్లు ప్రకటన వెలువడింది. రైతుభరోసా పథకం అమల్లో భాగంగా ఏడాదికి రూ. 12 వేల నగదును ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. అందులో భాగంగా రైతన్నలకు తొలివిడతగా రూ. 6 వేల నగదును జమ చేయనున్నారు. ఇప్పటి వరకు ఎకరా లోగా, రెండు ఎకరాలలోగా నగదు జమ చేసిన ప్రభుత్వం, తాజాగా మూడు ఎకరాల వరకు సాగు ఉన్న రైతుల ఖాతాల్లోకి నగదు విడుదల చేసింది. మరి మీ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి.