పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ జూన్ 12న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే, ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైం లో ఈ మూవీ జూన్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. ఆయన రెండు మూడు రోజులు షూటింగ్ కి డేట్స్ ఇవ్వకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయాల్లో బిజీ అవడం వల్ల, మూవీ షూటింగ్ కు టైం కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ వార్తతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ..
ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆ బాధ్యతలను జ్యోతి కృష్ణకు అప్పగించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్ పథకంపై ఎంఎం. రత్నం సమర్పణలో, ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీగా హరిహర వీలమల్లు మొదటి భాగం రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.