BigTV English
Advertisement

Solo Travel: సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రదేశాలకు తప్పకుండా వెళ్లండి !

Solo Travel: సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రదేశాలకు తప్పకుండా వెళ్లండి !

Solo Travel: ఒంటరి ప్రయాణం చేయడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇది జీవితంలోని క్లిష్ట అంశాలకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అంతే కాకుండా మీకు అద్భుతమైన అనుభవాలను అందిస్తుంది. ముఖ్యంగా మీరు పెళ్లి చేసుకోబోతున్నప్పుడు. వివాహానికి ముందు ఒంటరి ప్రయాణం మీ జీవితంలో అత్యుత్తమ అనుభవం కావచ్చు. చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు స్వేచ్ఛగా తమ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు.


తక్కువ బడ్జెట్‌లో సోలో ట్రిప్ చేయడం, కొత్త విషయాలను అనుభవించడం, కొత్త వ్యక్తులను కలవడం, స్వేచ్ఛను అనుభవించడం అనేది పూర్తిగా భిన్నమైన అనుభూతి. కానీ సోలో ట్రిప్‌కు వెళ్లే ముందు..కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇది మీ ట్రిప్‌ను సులభతరం చేస్తుంది. మీరు కూడా పెళ్లికి ముందు సోలో ట్రిప్ వెళ్లాలనుకుంటే.. ఈ ప్రదేశాలకు తప్పకుండా వెళ్లండి.

సిక్కిం సోలో ట్రిప్:
పర్వతాలలో ప్రయాణించడం ఇష్టపడే వారు సిక్కిం తప్పక వెళ్లాలి. సిక్కిం ఒక అందమైన గమ్యస్థానం, ఇక్కడ కాంచన్‌గంగా పర్వతాల మధ్య మంచుతో కప్పబడిన నగరాలు, చెరువులను చూడటం ఒక ప్రత్యేకమైన అనుభవంగా ఉంటుంది. సోలో ట్రిప్‌‌కి సిక్కిం మంచి ప్లేస్. ఇది అమ్మాయిలకు చాలా సురక్షితమైన ప్రాంతం. మీ ప్రయాణాన్ని సులభతరం చేసే స్థానిక గైడ్‌లు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇదే బడ్జెట్ ప్రకారం మంచి హోటళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి.


కోవలం సోలో ట్రిప్:
కోవలం కేరళ రాష్ట్రంలో ఉంది. కోవలం చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్. సముద్ర తీరంలో కూర్చుని సీ ఫుడ్ రుచి చూడాలనుకునే వారు ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడాలి. మీరు ఇక్కడ హౌస్ బోట్ ట్రిప్ కూడా ఆస్వాదించవచ్చు. కోవలంలో.. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఇక్కడ 3 స్టార్ నుండి లగ్జరీ హోటళ్ల వరకు అన్ని రకాల హోటళ్లను చూడవచ్చు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన టూరిస్టులను ఇక్కడ చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూసుకుంటారు. కాబట్టి ఈ నగరం సోలో ట్రిప్‌కు మంచి ఎంపిక కావచ్చు.

బాలి ట్రిప్:
బాలి హనీమూన్‌ ట్రిప్ లకు చాలా ఫేమస్ . కానీ ఇది సోలో ట్రిప్ చేసే వారికి కూడా ఉత్తమ ప్రదేశం అని చెప్పవచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. ఇక్కడ తక్కువ డబ్బుతో ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. బాలిలో సముద్రం, పర్వతాలు, ప్రకృతి అందాలు చూడటానికి చాలా బాగుంటాయి. ప్రదేశం సోలో ట్రిప్ చేసే అమ్మాయిలకు కూడా చాలా సురక్షితం. వివాహానికి ముందు ఇక్కడికి అమ్మాయిలు కూడా ట్రిప్ వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే !

పాండిచ్చేరి యాత్ర:
పాండిచ్చేరి అందమైన నగరం మాత్రమే కాదు.. ఇక్కడి ప్రశాంతత మిమ్మల్ని చాలా సంతోష పరుస్తుంది. నగర కాలుష్యం , శబ్దాలకు దూరంగా.. సోలో ట్రిప్‌కు పాండిచ్చేరి మంచి ఎంపిక అవుతుంది. ఇక్కడ జనాభా చాలా తక్కువ, ప్రశాంతమైన ప్రదేశంలో కొన్ని రోజులు గడపాలనుకునే వారు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. మీరు ఇక్కడ రోడ్ ట్రిప్‌ను కూడా సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి నిత్యం చాలా మందే వస్తారు. ఇక్కడి హోటళ్ళు, మార్కెట్లలో ఫ్రెంచ్ వాళ్లు చాలా మంది కనిపిస్తారు.

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×