DCM Pawan Kalyan:గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో థియేటర్ బంద్ పిలుపు వివాదం.. అటు థియేటర్లను ఇటు మల్టీప్లెక్స్ లను గట్టిగానే తాకింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా థియేటర్ కి ప్రేక్షకుడు రావడం లేదని.. సినిమా ఆడక డబ్బులు రావడం లేదని..అద్దె కూడా కట్టలేకపోతున్నామని.. అందుకే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లను బంద్ చేయాలి అనే నిర్ణయం తలెత్తగా నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో బంద్ ఉండదు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీసుల యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టింది.
పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగివచ్చిన యాజమాన్యం..
ముఖ్యంగా థియేటర్ల నిర్వహణతో పాటు ఆహార పదార్థాల అమ్మకాలు, వాటి ధరలపై కూడా అధికారులు ఆరా తీశారు. మొత్తానికైతే సినిమా థియేటర్ల పై తనిఖీల ఎఫెక్ట్ ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ తనిఖీల ఎఫెక్ట్ తో సినిమా థియేటర్లు l, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కూడా దిగివస్తున్నాయి. ఒకప్పుడు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటేనే ప్రేక్షకుడు భయపడి పోయేవాడు. టిక్కెట్ ధరతో పాటు అక్కడ లభించే ఆహార పదార్థాల ధరలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసేవాడు. అందుకే చాలా మంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీల కోసం ఎదురు చూసేవాళ్ళు. ఫలితంగా థియేటర్ యాజమాన్యానికి నష్టం వాటిల్లింది. అందుకే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు యాజమాన్యం మొత్తం దిగివచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికైతే టికెట్ ధరలు పెంచమని అడిగిన యాజమాన్యానికి డీసీఎం గట్టి ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వన్ ప్లస్ వన్ ఆఫర్ తో పాటు 20% డిస్కౌంట్ కూడా..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లలో కూడా ఆహార పదార్థాల ధరలపై ఏకంగా 10 నుండి 20% వరకు డిస్కౌంట్ ప్రకటించి విక్రయాలు సాగించాలని నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు బై వన్ గెట్ వన్ ఆఫర్లతో వినియోగదారులకు తినుబండారులు విక్రయించనున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా తనిఖీలు చేపట్టిన అధికారులు టికెట్ ధరలు, ఆహార పదార్థాల క్వాలిటీ, వాటి ధరల పెంపు అలాగే శుభ్రతపై ఆరా తీయగా వచ్చిన ఫిర్యాదులను సీరియస్గా తీసుకొని.. ఇప్పుడు ఈ సోదాలు నిర్వహించారు. ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మిరజ్ సినిమాస్ మల్టీప్లెక్స్ లలో లార్జ్ సైజ్ పాప్ కార్న్ బకెట్ రూ.750 అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారుఇలా ఇష్టానుసారంగా అధిక ధరలు పెట్టి ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడేలా చేస్తున్న మల్టీప్లెక్స్ లకు నోటీసులు ఇచ్చారు. ధరలపై నియంత్రణ లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారట. దీంతో అసలుకే ఎసరు వచ్చేలా ఉందని గ్రహించిన సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లో యాజమాన్యం ఇప్పుడు దిగి వచ్చినట్లు తెలుస్తోంది. ధరలు తగ్గించి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ తనిఖీలు అన్నీ కూడా విశాఖపట్నంలో జరుగుతున్నాయి. మరి ఈ తనిఖీలు విశాఖపట్నం వరకే పరిమితం కానున్నాయా? లేక రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభావం పడనుందా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే తనిఖి ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటేనే ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి సినిమా చూడగలడు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
also read:Nayanthara: ఓహ్.. అదా సంగతి.. లేడీ సూపర్ స్టార్ తగ్గడానికి కారణం ఆ భయమేనా..?