Saif Ali Khan: మామూలుగా సినీ సెలబ్రిటీ ఇళ్లు ఫుల్ సెక్యూరిటీతో ఉంటాయి. వారి అనుమతి లేకుండా ఎవరూ వారి ఇంట్లోకి రాలేరు. అలాంటిది బాలీవుడ్ సీనియర్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు.. ఏకంగా ఈ హీరోపై కత్తితో దాడి చేశారు. దొంగలు కత్తిలో సైఫ్‌ను పొడవడంతో గాయాలపాలైన హీరోను వెంటనే ముంబాయ్‌లోని లీలావతి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటినుండి సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పోలీసులు, డాక్టర్లు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా గాలింపు చర్యలు చేపట్టి ఈ చర్యకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఫుటేజ్ ఆధారంగా
సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిందని తెలియగానే ముంబాయ్ డీసీపీ సైతం లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ దాడి గురించి తెలియగానే పోలీసులు 10 డిటెక్షన్ టీమ్స్‌గా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. అసలు దండగుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) అపార్ట్‌మెంట్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడో తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. అదే సమయంలో ఒక నిందితుడి మొహం వారికి క్లియర్‌గా కనిపించింది. దీంతో ఆ ఫుటేజ్‌ను పట్టుకొని వారు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అలా నిందితుడిని పోలీసులు మరింత త్వరగా పట్టుకోగలిగారని తెలుస్తోంది.
డాక్టర్ల క్లారిటీ
కత్తి గాయాలతో ఉన్న సైఫ్ అలీ ఖాన్‌ను తన భార్య కరీనా కపూర్ ఆసుపత్రికి తరలించింది. దీంతో ఆ గాయాలను పరిశీలించి వెంటనే సైఫ్‌కు సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు డాక్టర్లు. సర్జరీ చేసేంత వరకు తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి విషయం బయటికి రానివ్వలేదు. మొత్తానికి సర్జరీ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. ఆసుపత్రిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్‌ను చూడడానికి పలువురు సినీ సెలబ్రిటీలు అక్కడికి వచ్చారు. ముందుగా సైఫ్ పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఆ కుటుంబం నుండి మాత్రం ఈ దాడి గురించి ఎవరూ స్పందించలేదు.
Also Read: సైఫ్ సామ్రాజ్యం ఇదే.. రాజ కుటుంబం నుంచి నటుడిగా?
అసలు ఏం జరిగిందంటే?
ముంబాయ్‌లోని బాండ్రా ఏరియాలో సద్గురు షరన్ అపార్ట్మెంట్‌లో 12వ ఫ్లోర్‌తో తన భార్య కరీనా కపూర్, ఇద్దరు కుమారులతో కలిసుంటాడు సైఫ్ అలీ ఖాన్. కేవలం దొంగతనం కోసం ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డాడు ఇద్దరు దుండగులు. దాదాపు అర్థరాత్రి 2.30 గంటల సమయానికి ముందుగా సైఫ్ చిన్న కుమారుడు జై రూమ్‌కు వెళ్లి అక్కడ దోపిడీ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయంలో జై ఒంటరిగా లేడు. తన కేర్ టేకర్ కూడా తనతోనే ఉంది. దొంగలను చూసి కేర్ టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి వచ్చాడు. దీంతో సైఫ్‌ను చూసిన దుండగులు తనపై కత్తిలో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తనకు తీవ్ర గాయాలు అయ్యాయి.