BigTV English

Trivikram – Allu Arjun Movie : ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు అలాంటి వరల్డ్ ఎవరూ చూసి ఉండరు

Trivikram – Allu Arjun Movie : ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు అలాంటి వరల్డ్ ఎవరూ చూసి ఉండరు

Naga Vamsi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ తను కెరియర్లో రచయితగాని అద్భుతమైన పేరు సాధించుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ హీరోగా చేసిన నువ్వే నువ్వే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా చేసిన అతడు సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ హాలీవుడ్ లెవెల్ లో ఉంది అంటూ ఇప్పటికీ త్రివిక్రమ్ మీద ప్రశంసలు వస్తుంటాయి. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా అతడు సినిమాకి మంచి టిఆర్పి రేటింగ్ వస్తుంది.


ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరియర్లో నితిన్, తరుణ్ మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలు కేవలం స్టార్ హీరోస్ తో మాత్రమే చేసాడు. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే ఎస్.ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ అని అనుకుంటున్నారు. దీనికి కారణం ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాను చేయకపోవడమే. నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద అటువంటి సినిమాను ఎవరు ఊహించి ఉండరు అంటూ కూడా ఆ సినిమా గురించి చెప్పాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి ప్రోమో జనవరి 2025న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మార్చి నుంచి రెగ్యులర్ గా జరగబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించాడు వంశీ.

ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పడిపోయిన ప్రతిసారి అంతకంటే వేగంగా పైకి లేచే క్యారెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2018లో జనవరి నెలలో అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది అది భారీ డిజాస్టర్ అయింది. అయితే ఎక్కువ టైం తీసుకోకుండా అదే సంవత్సరంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు. త్రివిక్రమ్ కెరియర్ లో అది గ్రేట్ కం బ్యాక్ అని చెప్పాలి. ఒక సందర్భంలో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. కాన్సన్ట్రేషన్ చేసి ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తే మేమందరం లగేజీ సర్దుకోవాలి అనుకునే డైరెక్టర్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నారు ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సుకుమార్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సుకుమార్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. మరి త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రూవ్ చేసుకున్న కూడా ఇంకా పాన్ ఇండియా రేంజ్ లో తిరుగుతున్న శ్రీనివాస్ గుర్తింపు సాధించాల్సిన అవసరం ఉంది. మరి అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో త్రివిక్రమ్ ఏ రేంజ్ టచ్ చేస్తాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.


Also Read : Manchu Manoj Wife Mounika: మీరు న్యాయంగా చెయ్యండి… దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయ్

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×