Manchu Family: కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో చెలరేగిన దుమారం సోషల్ మీడియా అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్నగా మొదలయిన ఈ ఫ్యామిలీ గొడవ మీడియా ముందుకు వచ్చింది. మోహన్ బాబుతో సహా ఈ కుటుంబంలో అందరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆ తర్వాత గొడవలు కాస్త సర్దుకున్నాయి. అప్పటినుండి ఇప్పటివరకు మళ్లీ మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకి రాలేదు. ఇంతలోనే మంచు ఫ్యామిలీ అంతా ఒకే చోట కలుస్తున్నారని తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. మళ్లీ పబ్లిక్‌గా వీరు ఎలాంటి ఇబ్బంది క్రియేట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో పోలీసులు మంచు ఫ్యామిలీ రీయూనియన్‌కు సిద్దంగా ఉన్నారు.
అందరూ ఒకేచోటికి
మోహన్ బాబు కుటుంబానికి పలు వ్యాపారాలు ఉన్నాయి. అందులో మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ఒకటి. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో కూడా అన్నదమ్ములు అయిన విష్ణు, మనోజ్‌ల మధ్య వివాదాలు జరిగాయని పలుమార్లు బయటికొచ్చింది. ఇప్పుడు అదే యూనివర్సిటీలో చాలాకాలం తర్వాత ఈ కుటుంబం కలవనుంది. మామూలుగా ప్రతీ సంవత్సరం సంక్రాంతికి తనకు చెందిన స్కూల్స్, కాలేజీల్లో వేడుకలు నిర్వహిస్తారు మోహన్ బాబు. ఆ వేడుకలకు తాను కూడా స్వయంగా హాజరవుతారు. ఈసారి కూడా సంక్రాంతి వేడుకలను తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనున్న సంక్రాంతి వేడుకల్లో మంచు మనోజ్ కూడా పాల్గోనున్నాడని సమాచారం.
Also Read: తమిళంలో ‘డాకు మహారాజ్’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
జల్లికట్టులో మనోజ్
రంగంపేటలో జరగనున్న జల్లికట్టులో మంచు మనోజ్ (Manchu Manoj) పాల్గోనున్నాడని సమాచారం. ఆపై మోహన్ బాబు యూనివర్సిటీ కూడా తను రానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం మోహన్ బాబు (Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu) అక్కడే ఉన్నారు. ఇక మంచు మనోజ్ కూడా ఇప్పుడు అక్కడికే ప్రయాణమయ్యాడు. రంగంపేట, నారావారిపల్లి, మోహన్ బాబు యూనివర్సిటీలను చుట్టేయాలని మనోజ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్న చోటికి మంచు మనోజ్ కూడా వస్తే కచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుందనే ఉద్దేశ్యంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
అలా మొదలు
ముందుగా ఒక చిన్న ఆస్తి గొడవ వల్ల మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. ఆ గొడవలో మోహన్ బాబు, మంచు విష్ణు అనుచరుడు తనపై అటాక్ చేయడంతో చికిత్స కోసం ఆసుపత్రికి కూడా వెళ్లాడు. అలా మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న గొడవల గురించి బయటికొచ్చింది. ఆ తర్వాత తన తండ్రి తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ రచ్చ మొదలుపెట్టాడు మనోజ్. గేట్లు బద్దలుకొట్టాడు. ఇంట్లోకి వెళ్లి గొడవ చేశాడు. మీడియా సపోర్ట్ కోరాడు. ఇదంతా చూసిన మంచు విష్ణు.. తనపై కోపంతో తన ఇంటి జెనరేటర్‌లో చక్కెర పోశాడని కూడా మనోజ్ ఆరోపించాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా మంచు ఫ్యామిలీ గొడవలు బయటపడుతూనే ఉన్నాయి.