E-Paper
Advertisement

OTT Movie : టాప్ ర్యాంక్స్ వస్తే ఈ దెయ్యం చేతిలో మూడినట్టే… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : టాప్ ర్యాంక్స్ వస్తే ఈ దెయ్యం చేతిలో మూడినట్టే… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా
Advertisement

OTT Movie : ఈ మధ్య కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు బాగా అలవాటు పడిపోయారు మూవీ లవర్స్. ఓటీటీలో ఈ సినిమాలు కూడా మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక దెయ్యం స్కూల్ పిల్లలను చంపుతుంటుంది. ఈ మూవీలో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?  అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

హైస్కూల్ విద్యార్థులైన కాంగ్ ఈ-నా, ఆమె స్నేహితురాలు యూన్ మ్యాంగ్-హ్యో తో సహా 20 మంది టాప్ విద్యార్థులు ఒక రోజు ఎగ్జామ్ కోసం స్కూల్‌ లో ఉంటారు. ఈ తరగతిలో ఇంగ్లీష్ టీచర్ సో-యంగ్, మరో టీచర్ హ్వాంగ్ చాంగ్-వూక్, స్టూడెంట్ మేనేజర్ చీ-యంగ్ కూడా ఉంటారు. అయితే తరగతి మధ్యలో, స్కూల్ లౌడ్‌స్పీకర్ నుండి ఒక సంగీతం వినిపిస్తుంది. క్లాస్‌రూమ్ టీవీ లో టాప్ ర్యాంక్ విద్యార్థి మిన్ హ్యే-యంగ్ నీటితో నిండిన గాజు ట్యాంక్‌లో బంధించబడిన దృశ్యం కనిపిస్తుంది. ఆతరువాత ఒక స్వరం అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ .. విద్యార్థులు ఒక డెత్ గేమ్‌లో ఉన్నారని,  ఎగ్జామ్ లో సరైన ఆన్సర్స్  ఇవ్వకుంటే, బంధించబడిన విద్యార్థిని చనిపోతుందని ఆ స్వరం ఆందరికీ వినిపిస్తుంది. స్కూల్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తే కూడా మరణం సంభవిస్తుందని హెచ్చరిస్తుంది.

అయితే మొదటి గేమ్ లో సరైన సమాధానాలు ఇవ్వడంలో విఫలమైనందున, హ్యే-యంగ్ నీటిలో మునిగి చనిపోతుంది.  ఆ హెచ్చరికను ధిక్కరించి, విద్యార్థులు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక టీచర్ హాల్ మానిటర్ లో చనిపోతుంది. విద్యార్థులు భయంతో ఆ గేమ్ లోని సమస్యలను పరిష్కరించడానికి, బయటకు వెళ్లే మార్గం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొంత మంది విధ్యార్థులు దారుణంగా చనిపోతారు. వీళ్ళంతా ర్యాంక్ ల వారీగా చనిపోతుంటారు.  గతంలో ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థిని దెయ్యంగా మారి వీళ్ళను చంపుతుంటుంది. చివరికి ఈ డెత్ గేమ్ ను విద్యార్థులు ఎలా ఎదుర్కుంటారు ? ఎందుకు విద్యార్థులను ఆ దెయ్యం టార్గెట్ చేస్తోంది ? స్కూల్ నుంచి వీళ్ళు ఎలా బయటపడతారు ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : కార్లో ఉన్నంత సేపూ పగలే, కారు దిగితే మాత్రం నైట్… హర్రర్ మూవీ లవర్స్ కు ఫుల్ కిక్కిచ్చే మూవీ

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ స్లాషర్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెత్ బెల్’ (Death Bell). 2008 లో వచ్చిన ఈ కొరియన్ మూవీకి చాంగ్ దర్శకత్వం వహించారు.ఈ స్టోరీ ఒక హైస్కూల్‌లో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇందులో లీ బీమ్-సూ, నామ్ గ్యూ-రీ, కిమ్ బం ముఖ్య పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్

అండర్‌వరల్డ్ దందాలతో ఆగమయ్యే సిటీ… గ్యాంగ్‌స్టర్ వార్ తో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గ్లామర్ లైఫ్ వెనకున్న సీక్రెట్… సోషల్ మీడియా ఫాలోవర్స్ డోంట్ మిస్

పార్క్‌లో మొదలైన ప్రేమ… పెళ్లి తర్వాత ఊహించని మలుపులు.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

30 దాటినా పిల్లను ఇవ్వట్లేదు… ఈ బ్యాచిలర్ హంగామా చూస్తే నవ్వాగదు

Big Stories

Advertisement
×