Ashwin – IPL: క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ ఈసారి కాస్త త్వరగానే ప్రారంభం కాబోతోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పలకరించే ఈ లీగ్.. ఈసారి 2025 మార్చి నెలలోనే ప్రారంభం కాబోతోంది. పలు నివేదికల ప్రకారం 2025 మార్చి 14 నుండి.. 2025 మే 25వ తేదీ వరకు ఐపీఎల్ {IPL 2025} మ్యాచ్ లు జరగనున్నాయట. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం భారీ ఉత్కంఠతో ముగిసిన విషయం తెలిసిందే.
జెడ్డా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఈ వేలంలో తొలిరోజు రిషబ్ పంత్ 27 కోట్లు పలికి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ వేలంలో కొందరు ఆటగాళ్లు భారీ ధర పలకగా.. మరికొందరు కీలక ఆటగాళ్లకు నిరాశ ఎదురయింది. కీలక ఆటగాళ్లు అన్ సోల్డ్ గా మిగలడం అభిమానులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు కలిపిన రవిచంద్రన్ అశ్విన్ {Ashwin} ని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.75 కోట్లతో దక్కించుకుంది.
ఈ ఐపీఎల్ 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత 2009 ఏడాదిలో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో {Ashwin} ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అరంగేట్రం చేశాడు అశ్విన్. అప్పటినుండి వరుసగా 8 సంవత్సరాల పాటు చెన్నై జట్టులో ఆడాడు. ఆ తర్వాత 2015లో చెన్నై సూపర్ కింగ్స్ తో అతనికి సంబంధం ముగిసింది. ఆ తర్వాత సంవత్సరం 2016 – 2017 రెండు సంవత్సరాల పాటు రైజింగ్ పూణే సూపర్ జేంట్స్ కి ఆడాడు. ఇక 2018 – 19 రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ కి ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: Ashwin – Indian Players: అశ్విన్ రిటైర్మెంట్… సేఫ్ గా బయటపడ్డ ముగ్గురు ప్లేయర్లు ?
ఇక 2020 – 21 రెండు సీజన్ల పాటు {Ashwin} ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత 2022 నుండి 2024 రెండు సీజన్ లలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఉన్నాడు. ఇక 2025 ఐపీఎల్ మెగా వేలంలో అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. తాజాగా తన ఇంటర్నేషనల్ కెరీర్ కి అనూహ్యంగా ముగింపు పలికిన అశ్విన్ క్లబ్ క్రికెట్ లో కొనసాగుతానని, వచ్చే ఏడాది 2025 ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే తరపున కెరియర్ కొనసాగిస్తానని చెప్పాడు. కానీ 2025 ఒక్క సీజన్ మాత్రమే అతడు {Ashwin} ఐపిఎల్ ఆడనున్నాడని, ఆ తర్వాత ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం అశ్విన్ మరికొన్ని సంవత్సరాలపాటు ఐపిఎల్ లో కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి అశ్విన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది వేచి చూడాలి. అశ్విన్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 211 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ తో 800 పరుగులు చేశాడు. ఇక అశ్విన్ ఐపీఎల్ లో తన బౌలింగ్ తో 180 వికెట్లు పడగొట్టాడు.