ACA – SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో దాదాపు 15 మ్యాచులు పూర్తయ్యాయి. అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad team ) పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో… గత వారం రోజుల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association ) మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదిరిపోయే ఆఫర్… సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Shreyas Iyer: క్రికెట్ లోకి రాకపోయి ఉంటే.. వడపావ్ అమ్ముకునేవాడు… శ్రేయస్ అయ్యర్ షాకింగ్ వీడియో?
వెంటనే హైదరాబాద్ ను వదిలేసి ఆంధ్రప్రదేశ్ కు రావాలని.. కావ్య పాపకు బంపర్ ఆఫర్ ఇచ్చిందట చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్…. ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో… సందెట్లో సడేమియా లాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్… మధ్యలో దూరింది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బంపర్ ఆఫర్ ఇస్తూ.. వాళ్లను రెచ్చగొడుతోంది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. హైదరాబాద్ వదిలేసి వైజాగ్ లో మ్యాచులు నిర్వహిస్తే… భారీ డిస్కౌంట్లు ఇస్తామని కూడా ప్రకటించిన అని తెలుస్తోంది. ఎన్ని రాయితీలు కావాల్సి… ఉంటే అన్ని డిస్కౌంట్లు… ఇస్తామని సన్రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆఫర్ ఇస్తుందట ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. అయితే దీనిపై ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం స్పందించలేదు.
దీనిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
ఇది ఇలా ఉండగా… టికెట్ల విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. కాంప్లిమెంటరీ పాసులను తమకు తక్కువగా ఇస్తున్నారని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తగ్గడం లేదు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వారిద్దరి మధ్య శాంతి చర్చలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ప్రస్తుతానికి అయితే కాంప్లిమెంటరీ పాసుల విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం సద్దు మణిగింది. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఇప్పటివరకు… సన్రైజర్స్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడింది. అయితే ఇందులో మొదటి మ్యాచ్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… వరుసగా రెండు మ్యాచ్లో ఓడిపోయింది. ఇక ఇవాళ నాలుగో మ్యాచ్ కూడా ఆడబోతోంది. కేకేఆర్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది.