BigTV English
Advertisement

Alekhya chitti pickles: అలేఖ్య చిట్టి పికిల్స్.. సజ్జనార్ ఎంట్రీ..?

Alekhya chitti pickles: అలేఖ్య చిట్టి పికిల్స్.. సజ్జనార్ ఎంట్రీ..?

అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్.
మూడు రోజులుగా నెటిజన్లు ఈ పికిల్స్ యాజమాన్యాన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.


నా దగ్గర పికిల్స్ కొనేంత డబ్బు లేదు, నేను పెళ్లి చేసుకోవడం లేదు..
నా దగ్గర పికిల్స్ కొనడానికి డబ్బుల్లేవని నా భార్య విడాకులిస్తానంది..
అర్జెంట్ గా కెరీర్ మీద ఫోకస్ చేయాలి, పికిల్స్ కొనడానికి డబ్బులు పోగేయాలి..
అలేఖ్య చిట్టి పికిల్స్ కొనడానికి సరిపడా డబ్బులు దొరికాయి, అర్జంట్ గా పెళ్లి చేసుకోవాలి..
ఇలీ మీమర్స్ రెచ్చిపోతున్నారు. మరికొందరైతే ఆ పికిల్స్ ప్రమోషన్ కింద దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.
మీ పికిల్స్ తిన్న తర్వాత నా భార్యకు గర్భం వచ్చిందని కొందరు మెసేజ్ పెడుతున్నారు, మీ పికిల్స్ ఇంటికొచ్చాక మా చెల్లికి పెళ్లి సంబంధం కుదిరిందని మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు.

ఆగడు మూవీ రిఫరెన్స్..
ఆగడు సినిమాలో సరోజ స్వీట్స్ కోసం హీరోయిన్ తమన్నా కూడా ఈ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేసేది. ఆ సినిమాలో తమన్నా సెంట్రిక్ గా పండిన కామెడీ ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ అనే హ్యాష్ టాగ్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.


సజ్జనార్ ఎంట్రీ..?
తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారంలో ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ఎంట్రీకోసం కొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కస్టమర్ ని బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పెట్టిన అలేఖ్య చిట్టి పికిల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కొంతమంది సజ్జనార్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేసారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారికి సజ్జనార్ ట్రీట్మెంట్ ఎలా ఉందో చూశాం. ఇప్పుడు కస్టమర్లను కించపరుస్తున్న అలేఖ్య చిట్టిపికిల్స్ వారిపై కూడా సజ్జనార్ దృష్టిసారించాలనే డిమాండ్ వినపడుతోంది.


సోషల్ మీడియా షేక్..
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సంగతి పక్కనపెడితే.. ఆ పికిల్స్ తయారు చేస్తూ, బిజినెస్ స్టార్ట్ చేసిన అమ్మాయిల్లో ఒకరు సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ అప్ లోడ్ చేసిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ఆ వీడియోల్ని వెదికి మరీ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. పికిల్స్ వివాదానికి ఈ వీడియోలకు సంబంధం లేదంటూ సెటైరిక్ గా ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వివాదం, వీడియోలతో అలేఖ్య చిట్టి పికిల్స్ యజమానులుగా చెప్పుకుంటున్న ఆ అమ్మాయిలు మాత్రం మరింత పాపులర్ అయ్యారు. వారి వీడియోలకు విపరీతమైన లైక్ లు, షేర్లు వస్తున్నాయి. కొంతమంది వివాదం సంగతి పక్కనపెట్టి, వారి డ్యాన్స్ లను పొగుడుతూ మెసేజ్ లు పెడుతుండటం విశేషం.

ఇక సోషల్ మీడియా కారణంగా అలేఖ్య చిట్టి పికిల్స్ కి ఎంత క్రేజ్ వచ్చిందో, అదే సోషల్ మీడియా కారణంగా వారి వెబ్ సైట్ కూడా మూతపడింది. సోషల్ మీడియా రచ్చతో ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ ఆర్డర్లు కూడా తీసుకోవడం లేదు. ఈ వివాదం మొత్తం సోషల్ మీడియాలోనే జరగడం విశేషం. మరి దీనికి ముగింపు ఎప్పుడో చూడాలి.

Related News

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

High Court Verdict: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

Viral Video: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?

Viral News: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. న్యూస్ పేపర్‌లో ఊహించని ప్రకటన, ఎవరు ఆ ఆత్మారాం?

Pregnancy Job Scam: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?

Big Stories

×