HBD Aditi Govitrikar:పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కెరీర్ లో తీసిన ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ హిట్ తర్వాత మరో సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ‘తొలిప్రేమ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ అందుకున్నా..ఆ క్రేజ్ ని మరింత పెంచిన చిత్రం ‘తమ్ముడు’. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ అందరికీ ఈ చిత్రంతోనే తెలిసాయి. పైగా ఇందులో ప్రీతి జింగానియా హీరోయిన్గా నటించగా.. రెండవ హీరోయిన్గా అదితి గోవిత్రికర్(Aditi Govitrikar) నటించారు. మొదటి సినిమాలోనే తన అద్భుతమైన అందంతో, స్మైల్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమ వివాహం..
ఇకపోతే అదితి గోవిత్రికర్ ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె అక్కడే కొన్ని చిత్రాలలో నటించింది. ఇకపోతే ఈమె ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఎన్నో ఘనతలు సాధించింది కూడా.. ఈమె యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా.. 1997లోనే ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఈమె డాక్టర్ వృత్తిలో కొనసాగుతూనే మోడలింగ్ పై ఆసక్తి పెంచుతుంది. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ఈమెకు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇకపోతే ఈమె ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడు తన సీనియర్ ముఫ్ఫాజల్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. అయితే మతపరమైన కారణాలవల్ల వీరి పెళ్లికి అదితి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినప్పటికీ 1998లో రహస్యంగా వివాహం చేసుకుంది. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరగగా.. భర్త కోసం ఈమె కూడా ముస్లింగానే మతం మార్చుకుంది. ఆ తర్వాత సారా అని తన పేరును కూడా మార్చుకుంది. వీరికి ఒక కూతురు, కుమార్తె సంతానం జన్మించారు.
భర్త కోసం ఎన్నో త్యాగాలు.. కానీ..
ఇకపోతే వివాహం తర్వాత అదితి మోడల్ గానే కాకుండా డాక్టర్ గా కూడా తన వృత్తిని కొనసాగించింది. కానీ పిల్లల పుట్టాక భార్య – భర్తల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆ విభేదాలు తారస్థాయికి చేరడంతో ఈమె భర్త ఈమెకు విడాకులు ఇచ్చి భార్య పిల్లల్ని వదిలేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. డాక్టర్ గా, హీరోయిన్గా, మోడల్గా ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాలు చూసిన ఈమె వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కట్టుకున్న భర్త కోసం కుటుంబాన్ని వదులుకుంది. మతాన్ని మార్చుకుంది. ఇలా ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ అతడు మాత్రం ఈమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. అయినా ఎంతో కుమిలిపోయిన ఈమె పిల్లలే ధైర్యంగా మనోధైర్యం తెచ్చుకొని తిరిగి డాక్టర్ వృత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం తన వృత్తిని కొనసాగిస్తూనే మరొకవైపు పిల్లల్ని సొంతంగా పెంచుతుంది కూడా.. అంతేకాదు 2001లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ కూడా ఈమె కావడం గమనార్హం. ఏదేమైనా ఈరోజు అదితి బర్తడే కావడంతో ఈమెకు సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Harihara Veeramallu: ‘అసుర హననం’ అంటూ సాంగ్ రిలీజ్.. పవన్ కళ్ళల్లో ఆ రౌద్రం చూశారా..?