Poonam Kaur: వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అని వచ్చేస్తుంది నటి పూనమ్ కౌర్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, లైంగిక వేధింపులు ఈ మాటలు వినిపించాయి అంటే.. పూనమ్ ను ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రస్తుతం ఈ చిన్నదానికి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ వివాదం దొరికింది. ఈ వివాదం మొదలైనప్పటినుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. పవన్ ను కదిలిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న గోవిందా.. గోవిందా అని ఒక ఫోటోను షేర్ చేసి.. తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ చేసింది ఏం లేదని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేసింది.
ఇక ఈరోజు.. పవన్ కళ్యాణ్ .. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల వెళ్లిన విషయం తెల్సిందే. పవన్ మొదటి భార్య రేణు దేశాయ్ కూతురు ఆద్య, ఆయన రెండో భార్య కూతురు పోలైనా అంజనా (Polena Anjana) తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పోలైనా క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇక ఆమె మైనర్ కావడంతో తండ్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. ఇక అనంతరం కూతుళ్లతో కలిసి పవన్ మహాద్వార ప్రవేశం చేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
పవన్ కళ్యాణ్ కూతుళ్లు ఇద్దరు ఒకేలా కనిపించడం విశేషం. అయితే కూతురు కోసం పవన్ డిక్లరేషన్ మీద సంతకం చేసి, అంత రిస్క్ చేసి స్వామివారి దర్శనం చేయించడంతో పూనమ్.. కొద్దిగా అక్కసును వెళ్లగక్కిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ” ప్రతి ఒక్కరికి కూతురు ముఖ్యమే” అనే లైన్ ను ఆమె పోస్ట్ చేసింది. అంటే.. తాను కూడా తన తండ్రికి ముఖ్యమే కదా.. మీ కూతురును మీరెంత జాగ్రత్తగా చూసుకున్నారో.. ఎదుటివాళ్ళ కూతురును కూడా బాధపెట్టకూడదు అనేది తెలియదా.. ? అనేవిధంగా పూనమ్ చెప్పిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
ఇక పూనమ్ కెరీర్ ను నాశనం చేసింది త్రివిక్రమ్ అని, దాని వెనుక పవన్ కూడా ఉన్నారని ఆమె ఎప్పటినుంచో ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఇక జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు బయటకు వచ్చాకా.. త్రివిక్రమ్ పై తాను కూడా వేధింపుల కేసు పెట్టానని, కానీ, మా అసోసియేషన్ తిరస్కరించిందని ఆమె పోస్ట్ చేసింది. ఇక అప్పుడు తనకు జరిగిన అన్యాయానికి.. పూనమ్ ఇదుగో ఇలా సందు దొరికినప్పుడల్లా ఏకిపారేస్తుంది. మరి పూనమ్ విషయంలో ఇప్పటికీ పవన్, త్రివిక్రమ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది అంతుపట్టని విషయం అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
Everyone’s daughter is important !!!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 2, 2024