BigTV English

Update on Salaar 2: ఎవర్రా.. సలార్ 2 ఆగిపోయింది అన్నది.. క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్!

Update on Salaar 2: ఎవర్రా.. సలార్ 2 ఆగిపోయింది అన్నది.. క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్!

Salaar 2 Will Begin at The End of The May: సలార్ 2 ఆగిపోయింది.. ఆగిపోయింది బాబోయ్ అని నెత్తి నోరు కొట్టుకుంటున్న ఫ్యాన్స్‌కు మూవీ టీం అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రభాస్ సలార్ 2 సినిమా ఆగలేదు అభిమానులారా అంటూ ఓ ఫోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మరి ఆ పోస్టర్‌లో ఏముందో చేసేద్దాం రండి..


ప్రభాస్ సినీ కెరీర్ ముగిసింది అని అనుకునే టైంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ అందరి ఆలోచనలను తిరగరాసింది. అప్పటి వరకు ఎలాంటి హిట్లు లేక సతమతమవుతున్న ప్రభాస్‌కు అలాగే ఆయన అభిమానులకు ఈ మూవీ ఆకలి తీర్చింది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ ఉంది. అయితే మధ్య మధ్యలో ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయి ఫ్లాప్ టాక్‌ తచ్చుకోవడంతో అందరిలోనూ సలార్‌పై డౌట్ ఉండేది.

కానీ పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఒక్క సారిగా మారిపోయింది. ప్రభాస్ మాస్ లుక్‌కి యావత్ సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఇక గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అదరగొట్టేసింది. దీంతో మూవీ చివర్లో సెకండ్ పార్ట్ ఉంటుందని తెలిపారు.


Also Read: సలార్ 2 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. అఫీషియల్‌గా చెప్పేసిన నటుడు

అయితే ఈ సెకండ్ పార్ట్‌పై తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా మూడు రోజుల క్రితం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మాత్రం ఈ మూవీ గురించి ఎక్కడ లేని రూమర్స్ వచ్చాయి. ఈ మూవీ ఆగిపోయిందని.. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదని టాక్ గట్టిగా నడిచింది. దానికి తోడు ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబో మూవీ సెట్ అయింది. ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్2’ ఆగిపోయిందంటూ తెగ ఫీలైపోయారు. ‘ఎన్టీఆర్ 31’ తర్వాతే సలార్ 2 ఉంటుందని మరికొందరు చర్చించుకున్నారు. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవడంతో ‘సలార్’ మూవీ టీం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. అందులో ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కలిసి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఆ ఫొటోకి ‘They can’t stop laughing 😁’ (వాళ్లకి నవ్వు ఆగట్లేడు) అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Also Read: Kalki – 2898 Movie: ‘కల్కి’ మూవీ నుంచి సర్‌ప్రైజ్ వీడియో

దీంతో సలార్ 2 మూవీ ఆగిపోయిందన్న వార్తలకు మూవీ టీం గట్టిగా చెక్క పెట్టింది. అదే సమయంలో హమ్మయ్య మూవీ టీం మంచి వార్త అందించిందంటూ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్‌ను జూన్, జూలైలో కంప్లీట్ చేసే ప్లాన్‌లో ప్రశాంత్ నీల్ ఉన్నడంట. ఎందుకంటే దాదాపు సెకండ్ పార్ట్‌కి సంబంధించిన చాలా షూటింగ్‌ను ఫస్ట్ పార్ట్‌లోనే కంప్లీట్ చేశారంట.. అందువల్లనే మిలిగిన షూటింగ్‌కు ఈ రెండు నెలలు సరిపోతాయని టాక్ వినిపిస్తోంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×