BigTV English

1YearForAdipurush: ఓం.. కమ్ టూ మై రూమ్.. ఏడాది అయినా వదలడంలేదుగా

1YearForAdipurush: ఓం.. కమ్ టూ మై రూమ్.. ఏడాది అయినా వదలడంలేదుగా

1YearForAdipurush: హీరోలకు హిట్స్, ప్లాప్స్ కొత్తేమి కాదు. కానీ, ఫ్యాన్స్ కు తమ అభిమాన హీరో సినిమా ప్లాప్ అయ్యింది అంటే అది అప్పటితో ముగిసే కథ కాదు. ఎందుకంటే.. ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజు వారు చేసే హడావిడి అంతా కాదు. ఎన్నో అంచనాలు పెట్టుకొని థియేటర్ కు వెళితే.. ఆ సినిమా చూడలేక నిరాశతో బయటకు వచ్చినప్పుడు పడే బాధ ఎవరు వర్ణించలేరు. ప్రతి హీరో ఫ్యాన్స్ కు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది.


సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజు అదే నిరాశతో ప్రభాస్ ఫ్యాన్స్ బయటకు వచ్చారు. అవును.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సనన్ సీతగా కనిపించింది. ఇక సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన హైప్ ను ఇప్పటికీ ఏ ప్రభాస్ ఫ్యాన్ అంత ఈజీగా మర్చిపోలేరు.

ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ, రాముడిగా మొదటిసారి కనిపించబోతున్నాడు. సైఫ్ అలీఖాన్ మొదటిసారి విలన్ గా కనిపించబోతున్నాడు.. ఇన్ని ఎలివేషన్స్ ఉండడంతో.. ఎప్పుడెప్పుడు ఆదిపురుష్ రిలీజ్ అవుతుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. ఇక ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తోనే వివాదం మొదలయ్యింది. ఏ సినిమాకు అయినా వివాదాలు తప్పవు కదా అని ఫ్యాన్స్ సైతం గుండెను అరచేతిలో పెట్టుకొని 2023 జూన్ 16 న థియేటర్ లో అడుగుపెట్టారు.


ఇక సినిమా చూసి బయటకు వచ్చి వారు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలో రామాయణాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమాల్లో ఏ సినిమా ఫేస్ చేయని ట్రోల్స్ ని ఈ ఫేస్ చేసింది. ఎవరు ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. విజువల్ వండర్ గా ఉంటుందని అనుకున్న ఈ సినిమా అసలు విఎఫ్ఎక్స్ చేశారా.. ? లేదా.. ? అనే అనుమానం వచ్చేలా ఉందని చెప్పుకొచ్చారు.

కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలా ఉందా.. ? ప్రభాస్ ను ఏం చేసావ్ రా ఓం రౌత్ అని తిట్ల దండకం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ ట్రోలింగ్ ఆగడం లేదు. రామాయణం.. రామాయణం అని చెప్పి రాడ్ సినిమా చూపించావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. ఓం కు వార్నింగ్ ఇచ్చినట్లు కమ్ టూ మై రూమ్ అన్న డైలాగ్ తో.. మళ్లీ.. ఓసారి రూమ్ కి వచ్చి పో ఓం రౌత్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇది ఎప్పుడు ఆగుతుందో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×