Prabhas:దానం చేయడంలో కర్ణుడుని ఎంత గొప్పవాడు అని పిలుస్తారో.. మన ఇండస్ట్రీలో ఉన్న ప్రభాస్(Prabhas) ని కూడా అలాగే కర్ణుడు అని , దానాలు చేయడంలో చాలా గొప్పవాడని అంటారు.. ఇప్పటి జనరేషన్ లో రాజులు, రాజ్యాలు లేవు కానీ క్షత్రియ వంశానికి చెందిన ప్రభాస్.. రాజు లాగే ప్రవర్తిస్తారు. ఆయన దగ్గరికి సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు.కడుపు నిండా తిండి పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి.. అయితే అలాంటి ప్రభాస్ మంచితనం ఎలాంటిదో మరోసారి రుజువయ్యింది. కన్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని కూడా ఓ వ్యక్తికి సహాయం చేశారట.
ప్రభాస్ గొప్పతనంపై ప్రశంసలు కురిపించిన తోట ప్రసాద్..
మరి ఇంతకీ ప్రభాస్ చేసిన ఆ సాయం ఏంటి? అనేది చూస్తే.. ప్రభాస్ నటించిన బిల్లా సినిమా(Billa Movie) అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో అనుష్క (Anushka ) హీరోయిన్ గా, కృష్ణంరాజు (Krishnam Raju) కీలక పాత్రలో నటించారు. మెహర్ రమేష్ (Mehar Ramesh) డైరెక్షన్లో 2009లో బిల్లా మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకి రచయితగా చేసిన తోట ప్రసాద్(Thota Prasad) ప్రభాస్ గొప్పతనం ఎలాంటిదో..? ఆయన ఎంత గొప్పవారో..? చెప్పారు.. రచయిత తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రభాస్ చాలా గొప్ప మనసు కలవాడు. నేను ఆయన నటించిన బిల్లా సినిమాకి రచయితగా చేశాను. ఆ కొద్దిపాటి పరిచయంతోనే ఆయన నాకు ఎప్పటికీ మర్చిపోలేని సహాయం చేశారు. నేను 2010లో ఓసారి ఆస్పత్రి పాలయ్యాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్న సంగతి తెలుసుకున్న ప్రభాస్ నా వైద్యానికి అవసరమయ్యే ఖర్చులన్నిటికి డబ్బు పంపించారు. అయితే ఇందులో అంత గొప్పేముందని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే..నేను హాస్పిటల్ లో ఉన్న రోజే ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు(Uppalapati Surya Narayana Raju) గారు మరణించారు. తండ్రి మరణించిన దుఃఖంలో మునిగి పోయినా కూడా ప్రభాస్ తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన తండ్రి చనిపోయిన రోజే నా హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు పంపించి నన్ను ఆదుకున్నారు.
తండ్రి చనిపోయిన రోజే.. రచయితకు ఆర్థిక సహాయం..
నా తండ్రే చనిపోయారు.. ఎవరు ఎక్కడ పోతే నాకెందుకులే అనుకోకుండా నా సినిమాకి రచయిత అని నన్ను ఆయన గుర్తించి నా హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు పంపించారంటే ప్రభాస్ గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.డబ్బులు పంపడమే కాదు నా పట్ల చాలా కేరింగ్ గా వ్యవహరించారు. ఆయన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ బిల్లా మూవీ రచయిత తోట ప్రసాద్ ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ గొప్పతనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఆ రచయిత కామెంట్లు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రభాస్ గొప్పతనం గురించి మరోసారి బయటపడిందని ఆయన అభిమానులు కాలర్ ఎగరేసుకొని మరీ ప్రభాస్ అన్న అంటే ఇలాగే ఉంటారు. సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సహాయం చేస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
HIT 3 Teaser Review : ఇంత వైలెంట్ ఏంటి నాని.. ఒక్క క్షణం ఊపిరాగిపోయిందిగా..?