Sampath Nandi : సంపత్ నంది… మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అయితే ఇలాంటి మాస్ డైరెక్టర్ గత కొన్ని రోజుల నుంచి డైరెక్షన్ పక్కన పెట్టి… నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయబోతున్నారు. శర్వతో Sharwa 38 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ అనౌన్స్ చేశారు. అయితే… ఈ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. దీనికి కారణం ఓ హీరోయిన్ అని తెలుస్తుంది.
శర్వానంద్ మూవీ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి..?
హీరోయిన్ పాత్ర ఎంత వరకు ఉంది..?
డైరెక్టర్ సంపత్ నంది ఈ మూవీ స్టార్ట్ చేయకుండా ఏం చేస్తున్నాడు..?
అనేవి ఇప్పుడు చూద్దాం…
సంపత్ నంది డైరెక్షన్‌లో చివరగా వచ్చిన మూవీ సిటీమార్. 2021లో ఈ సినిమా రిలీజ్ అయింది. దీని తర్వాత సంపత్ నంది మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. ఇప్పుడు శర్వానంద్‌తో చేస్తున్నాడు. Sharwa 38 అనే వర్కింగ్ టైటిల్‌తో గతేడాది సెప్టెంబర్‌లో అనౌన్స్ మెంట్ వచ్చింది. అనౌన్స్ మెంట్ వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా… మూవీ ఇంకా పెట్టాలెక్కలేదు. దీనికి కారణం మిల్క్ బ్యూటీ తమన్నా అని తెలుస్తోంది.
తమన్నా నటించిన ఓదెల 2 మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను కుంభమేళలో రిలీజ్ చేశారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాకు సంపత్ నంది కథ అందించడమే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ వల్లే… శర్వానంద్ Sharwa 38 లేట్ అవుతోందని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ ఓదెల 2 మూవీ బిజినెస్ పనుల్లో ఉన్నాడు సంపత్ నంది. ఆయన నిర్మాణంలో వచ్చిన లాస్ట్ మూవీ సింబా ప్లాప్ అయింది. దీంతో ఈ ఓదెల 2 మూవీకి కూడా బయ్యర్లు ముందుకు రావడం లేదు అని తెలుస్తుంది. పైగా… ఈ సినిమా రైట్స్ కోసం సంపత్ నంది భారీగా డిమాండ్ చేస్తున్నాడట. నార్మల్ ధరల కంటే… డబుల్ డిమాండ్ చేస్తునట్టు టాక్ వినిపిస్తుంది.
ఇలా.. శర్వానంద్ మూవీని పక్కన పెట్టేసి… ఓదెల 2 మూవీ కోసం బిజినెస్ చేస్తూ ఉండిపోతున్నాడు. అందు వల్లే Sharwa 38 ఇంకా పట్టాలెక్కలేదని సమాచారం.
పైగా … Sharwa 38 బౌండెడ్ స్క్రిప్ట్ ను శర్వానంద్ అడిగాడట. బౌండెడ్ స్క్రీప్ట్ వస్తే.. వెంటనే షూటింగ్ చేయడానికి, డేట్స్ కూడా ఇవ్వడానికి శర్వా రెడీగా ఉన్నాడట. అయితే… సంపత్ నంది ప్రస్తుతం మిల్క్ బ్యూటీ తమన్నా ఓదెల 2 మూవీ చుట్టూ ఉన్నాడు. ఇది రిలీజ్ అయ్యాకే… Sharwa 38 బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా ఓదెల 2 రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు.
Sharwa 38 స్టోరీ…
Sharwa 38 మూవీ 1960 బ్యాగ్రౌండ్‌లో ఉంటుందట. అందుకు అనుగూణంగా శర్వానంద్ కూడా తన లుక్ ను మార్చుకోవడానికి రెడీ అయ్యాడు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేని కథతో ఈ మూవీ వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… ఫుల్ స్క్రిప్ట్ వస్తేనే ఈ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సంపత్ నంది బౌండెండ్ స్క్రిప్ట్ కోసం శర్వానంద్ ఎదురుచూస్తున్నట్టు సమాచారం.