Prabhas Kalki 2898 AD Movie is in High Profits Before Release: కల్కి.. 2898 AD.. రిలీజ్‌కు రెడీ అయ్యింది. వెరీ సూన్ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ను అనేక టాలీవుడ్ మూవీస్ షేక్ చేశాయి. మరి ఇప్పుడీ రికార్డ్స్‌ను కల్కీ తుడిచిపెట్టేస్తుందా? ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు.. కల్కికి తేడా ఏంటి? ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చెబుతున్నదేంటి? ప్రభాస్.. తెలుగు స్టార్ మాత్రమే కాదు.. డార్లింగ్‌కు నేషన్ వైడ్‌గా ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. అలాంటి డార్లింగ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుందంటే క్రియేట్ అయ్యే బజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడీ అంచనాలను ప్రూవ్ చేస్తుంది ప్రీ రిలీజ్ బిజినెస్.. బాహుబలి ది కన్‌క్లూజన్.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డ్స్ నెవర్ బీఫోర్.. ఆ తర్వాత ఆ రికార్డ్ ఆర్ఆర్ఆర్ ఈ క్రెడిట్‌ను దక్కించుకుంది.
కానీ ఇప్పుడీ రికార్డ్స్‌ను కూడా బీట్ చేసే అవకాశం ఉంది సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్టిక్ మూవీ. ఓవర్ సీస్‌లో 3 మిలియన్ డాలర్స్ ప్రీ సెల్స్ జరిగాయి. ఈ నెంబర్ ఇంకా పెరుగూతనే ఉంది. హిందీ బెల్ట్‌లో 20 కోట్ల వరకు టికెట్స్ అమ్ముడుపోయే చాన్స్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరిగేందుకు ఇప్పటికే రెండు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో 8 రోజుల పాటు ఈ పెరిగిన ధరలు అందుబాటులో ఉంటాయి.. ఏపీలో అయితే 14 రోజుల పాటు టికెట్ ధరలు అమలులో ఉంటాయి. సో భారీగానే బిజినెస్ జరగడం ఖాయం. నిజానికి జరిగిపోతుంది కూడా.
ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం.. గంటలోనే అయిపోవడం అన్నీ జరిగిపోయాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో ప్రీ బుకింగ్ జోరుగా ఉంది. నిజానికి ఇది ఎక్స్‌పెక్ట్ చేసిందే.. కానీ హిందీలో కూడా ఇదే జోరు కనిపిస్తుంది. సో మూవీకి, ప్రభాస్‌కు ఏ రేంజ్‌లో హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే 400 కోట్ల వరకు బిజినెట్ అయ్యిందని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి రూ.600 కోట్లు.. సో నిర్మాత చాలా సేఫ్‌గా బయటపడం ఖాయంగా కనిపిస్తుంది. రూ.600 కోట్ల బడ్జెట్.. ప్రభాస్ హీరో.. ఈ ఈక్వేషన్స్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ రూ.600 కోట్ల బడ్జెట్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కానీ ఈ ఈక్వేషన్‌లో ఆలోచిస్తే కాస్త సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సాహాసాలు రాజమౌళిని నమ్ముకొని చేయవచ్చు. ఎందుకంటే రాజమౌళికి నార్త్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పాలంటే కమర్షియల్ మూవీస్‌కు పెట్టింది పేరు. మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్. ఎందుకంటే రికార్డులు నమోదవ్వాలన్నా.. వాటిని తిరగరాయాలన్న మాస్ ఆడియన్సే ముఖ్యం. మరి నాగ్ అశ్విన్ వీటన్నింటిని బీట్ చేయగలరా..?
Also Read: Kalki2898AD Review: కల్కి రివ్యూ.. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికేసినట్టే..
కానీ నాగ్ అశ్విన్ రూటే సపరేట్‌లా కనిపిస్తుంది. ఆయన మూవీస్ చాలా క్లాస్‌గా ఉంటాయి. ఈ మూవీ కూడా కంప్లీట్ సైంటిఫిక్ అని తెలిసిపోతుంది. ఎట్ ది సేమ్ టైమ్.. పురణాలను టచ్ చేస్తున్నారు. అయితే రాజమౌళితో కంపేర్ చేస్తే కంప్లీట్ డిఫరెంట్ పాత్ నాగ్ అశ్విన్ ది.. స్టోరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో.. విజువల్స్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చానన్నారు నాగ్ అశ్విన్.. ట్రైలర్ చూస్తే ఇది 100 పర్సెంట్ ఫ్యాక్ట్ అని తెలుస్తుంది కూడా.. మూవీ ట్రైలర్ చూశాక.. మరో విషయం కూడా తెలుస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు ఇండియాలో తీసిన మూవీస్ హాలీవుడ్ వరకు వెళ్లాయి.
కానీ ఈ మూవీ తీయడమే హాలీవుడ్ రేంజ్‌లో తీసినట్టు కనిపిస్తుంది. కావాలంటే ఓ సారి ట్రైలర్ చూడండి. మూవీ మేకింగ్‌లో మాత్రమే కాదు.. మూవీలో కూడా చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడినట్లు కనిపిస్తుంది. నిజానికి ఓ కొత్త లోకాన్నే ఊహించి.. తెరపై మన కళ్ల ముందు ఉంచినట్టు కనిపిస్తుంది. కాబట్టి.. సినిమా ఎలా ఉంటుంది? ట్రైలర్‌ను మించేలా మూవీ ఉంటుందా? లేదా? అనేది చూడాలి. నాగ్ అశ్విన్.. ఒక విషయంలో మాత్రం ఇప్పటికే సక్సెస్ అయ్యారు. మూవీకి పాజిటివ్ టాక్ తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైమ్.. సెన్సార్ సమయంలో సభ్యులు విజువల్ ఎఫెక్ట్స్ చూసి స్టాండింగ్ ఓవెసన్ ఇచ్చారని ప్రచారం జరగడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
అంతేగాకుండా.. మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి అగ్రతారలు నటించడం.. ఇవన్నీ మూవీకి ప్లస్ అయ్యే అంశాలు. నార్త్‌లో బిజినెస్ పెరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా స్ట్రాటజిక్‌గా ముందుకు వెళుతుంది మూవీ టీమ్.. మొదట బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడంలోనే చాలా క్యూరియాసిటీని పెంచేశారు. ఇక ఆ లాంచ్‌తో కల్కీపై చర్చ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఎక్కువ హడావుడి లేకుండా చాలా సైలెంట్‌గా జరిగిపోతుంది వ్యవహారం..
మాములుగా ప్రభాస్‌కు కాస్త సిగ్గెక్కువ. దీనికి తోడు దీపిక ప్రెగ్నెంట్.. అవడంతో నేరుగా ఇంటర్వ్యూస్‌తో హడావుడి చేయడం లేదు. కానీ.. మూవీకి ఇప్పటికే రావాల్సినంత హైప్ వచ్చేసింది.
సినిమా ఎలా ఉన్నాఒకటి రెండు, రోజులు కలెక్షన్స్ మాత్రం ఆగవు.. కానీ ఆ తర్వాత మూవీ కాసుల వర్షం కురిపియాలంటే మాత్రం మంచి టాక్ రావాల్సిందే. ఎందుకంటే ఇటీవల ఇలాంటి హైప్‌తోనే థియేటర్లలోకి వచ్చి అంతే వేగంగా ఎవ్వరికి కనపడకుండా వెళ్లిపోయాయి కొన్ని సినిమాలు. కల్కికి అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుందాం.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం కూడా లేదులేండి.