BigTV English

Trump Attack: ట్రంప్ పై దాడి గురించి అపోహలు పెట్టుకోవద్దు.. అమెరికా ప్రజలకు బైడెన్ సందేశం

అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో ఆయన గాయపడడంతో అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై ఆదివారం, జూలై 14 మధ్యాహ్నం.. అమెరికా అధ్యక్షడు జో బైడెన్ ప్రజలను ఉద్దేశిస్తూ టీవీ కార్యక్రమలో కాసేపు మాట్లాడారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ పై జరిగిన దాడి గురించి ఎటువటి అపోహలు పెట్టుకోవద్దని, దాడి వెనుక ఎవరు కుట్ర చేశారు, షూటర్‌ను దాడి చేయమని ఎవరు ఆదేశించారు, ఎవరు ప్రోత్సహించారు.. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పారు.

Trump Attack: ట్రంప్ పై దాడి గురించి అపోహలు పెట్టుకోవద్దు.. అమెరికా ప్రజలకు బైడెన్ సందేశం

Trump Attack: అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో ఆయన గాయపడడంతో అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై ఆదివారం, జూలై 14 మధ్యాహ్నం.. అమెరికా అధ్యక్షడు జో బైడెన్ ప్రజలను ఉద్దేశిస్తూ టీవీ కార్యక్రమలో కాసేపు మాట్లాడారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ పై జరిగిన దాడి గురించి ఎటువటి అపోహలు పెట్టుకోవద్దని, దాడి వెనుక ఎవరు కుట్ర చేశారు, షూటర్‌ను దాడి చేయమని ఎవరు ఆదేశించారు, ఎవరు ప్రోత్సహించారు.. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పారు.


Also Read: ట్రంప్‌పై దాడి చేసిన షూటర్ వివరాలు.. అతని తండ్రి ఏమన్నాడంటే..

ట్రంప్ హత్యాయత్నం తరువాత చాలామంది ఆయన అభిమానులు, రిపబ్లికన్ పార్టీని సమర్థించేవారు.. దీని వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, అతని పార్టీ డెమోక్రాట్స్ కుట్ర ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కొంతమంది సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా బైడెన్‌పై ఆరోపణలు చేశారు.


ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ప్రెసిడెంట్ బైడెన్ తన సందేశంలో “ట్రంప్ లేదా రిపబ్లికన్లు నాకు శత్రువులు కాదు, కేవలం ప్రత్యర్థులు మాత్రమే, మా మధ్య అభిప్రాయ భేదాలున్నా మంచి మిత్రులుగా ఉంటాం.. చాలాసార్లు కలిసి పనిచేశాం.. అన్నింటి కంటే ముఖ్యంగా మేమంతా అమెరికా పౌరలం. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు వాటిని మేమంతా ఒక్కటై ఎదుర్కోవాలి. అమెరికన్లంతా ఐకమత్యంగా ఉండాలి” అని చెప్పారు.

Also Read: అబ్రహం లింకన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు.. తుపాకీ దాడులకు గురైనవాళ్లు వీరే

అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే ట్రంప్ పై దాడి గురించి సీరియస్‌గా విచారణ జరపాలని ఎఫ్ బిఐకి ఆదేశించారు. సోమవారం మిల్‌వాకీ నగరంలో జరగబోయే రిపబ్లికన్ జాతీయ సమావేశానికి భద్రత కల్పించాలని సీక్రెట్ సర్వీస్ నిర్దేశించారు.

ట్రంప్ పై జరిగిన దాడి కేసు విచారణ చేస్తున్న ఎఫ్‌బిఐ అధికారులు మీడియాతో మాట్లాడారు. “ట్రంప్ పై దాడిన చేసిన యువకుడు థామస్ మాథ్యూ క్రూక్స్ (20) అని తెలిసింది. అతను దాడి చేయడానికి 5.56mm గన్ ఉపయోగించాడు. అయితే ఈ దాడిని అతను ఒక్కడే చేశాడు. అతని వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అతడిని ఎవరు ప్రోత్సహించారనేది తెలియదు..” అని ఎఫ్‌బిఐ ఎగ్జెక్యూటివ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాబర్ట్ వెల్స్ చెప్పారు.

 

Tags

Related News

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Big Stories

×