BigTV English

Fauji Update: కెరీర్ లో ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేస్తున్న ప్రభాస్… డార్లింగ్ కు సెట్ అవుతుందా?

Fauji Update: కెరీర్ లో ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేస్తున్న ప్రభాస్… డార్లింగ్ కు సెట్ అవుతుందా?

Fauji Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కిట్టిలో ఉన్న సినిమాలలో ‘ఫౌజీ’ (Fauji) కూడా ఒక మోస్ట్ అవైటింగ్ సినిమా అని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభాస్ లేకుండానే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.


చిన్న బ్రేక్ తీసుకున్న ప్రభాస్ 

ప్రభాస్ ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. తన కాలికైన గాయం నుంచి కోలుకోవడానికి ఆయన ఇప్పటికే మొదలు పెట్టిన సినిమా షూటింగ్ లను పక్కన పెట్టి రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఫౌజీ’ (Fauji)లో ఆయన రోడ్లు ఎలా ఉండబోతోంది అన్న ఇంటరెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. ప్రభాస్ ముందుగా ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూవీతో పాటు ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ సెట్స్ లో జాయిన్ కావలసి ఉంది. త్వరలోనే ప్రభాస్ తిరిగి సినిమా సెట్ లో జాయిన్ కాబోతున్నారు. ‘ది రాజా సాబ్ర్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా, హను రాఘవపూడి మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ ని త్వరలోనే తమిళనాడులోని మధురై సమీపంలో స్టార్ట్ చేయబోతున్నారు.


కెరీర్ లో ఫస్ట్ టైం ఇలాంటి పాత్రలో ప్రభాస్…

అయితే ఇప్పటిదాకా ప్రభాస్ ని మాస్, క్లాస్ అవతార్ లో చూశాం మనం. ఆయన ఎలాంటి పాత్ర చేసినా సరే చూడడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ కొత్తగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ కుర్రాడుగా కనిపించబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సినిమా మొత్తం దేవిపురం అగ్రహారం నేపథ్యంలో ఒక ముఖ్యమైన కుటుంబం చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోయే 20 రోజుల షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నారట. ప్రభాస్ అందుబాటులోకి వచ్చీ రాగానే ఈ షెడ్యూల్ తేదీలు ఈ వారంలోనే లాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ కు ఈ బ్రాహ్మణ కుర్రాడి రోల్ ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి.

‘సలార్’ సినిమాలో డైనోసార్ గా, ‘కల్కి’ సినిమాలో కర్ణుడిగా, ‘ది రాజా సాబ్’ సినిమాలో రాజుగా.. ఇక ఇప్పుడు ‘ఫౌజీ’ సినిమాలో సైనికుడిగా, బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ప్రభాస్ ఒక్కో సినిమాలో ఒక్కో రోల్ చేసి ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తున్నాడు. ‘ఫౌజీ’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×