Jacky bhagnani:సాధారణంగా సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు అనుకోకుండా అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి కూడా. అయితే వీటివల్ల చాలామంది గాయపడ్డారు. మరికొంతమంది చనిపోయారు కూడా. ఒక్కొక్కసారి ఆస్తి నష్టం జరిగితే.. ఇంకొకసారి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లోని ఒక సినిమా సెట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోణీకపూర్ (Boney kapoor ) వారసుడు అర్జున్ కపూర్ (Arjun kapoor) హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేరే హస్బెండ్ కి బీవీ’.. ఈ సినిమాని రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preeth singh) భర్త జాకీ భగ్నానీ (Jacky bhagnani ) నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ముంబైలోని ఒక పాత భవనంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.దీంతో అక్కడ ఉన్నవారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నిష్టం జరగకపోయినా.. కొంతమేరా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అంతేకాదు సెట్ లో ఉన్న హీరో అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానికి కూడా గాయాలయ్యాయి. ఇకపోతే ఈ ప్రమాదం జనవరి 18వ తేదీన జరగగా తాజాగా నేడు చిత్ర బృందం తెలిపినట్లు సమాచారం.ఇకపోతే నిర్వాహణ లోపం కారణంగానే సినిమా షూటింగ్ సెట్లో ఈ ప్రమాదం జరిగిందని, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ భద్రత విషయంలో ఈ స్థలాన్ని సరిగ్గా పరిశీలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని,అయితే ఈ ప్రమాదం వల్ల ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ షూటింగ్ కూడా ఆపేశారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు తివారీ తెలిపారు. ఇక ఈ విషయం తెలిసి అటు రకుల్ అభిమానులు, ఇటు అర్జున్ కపూర్, జాకీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. వీరందరూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా వీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ దశలో ఉంది ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, ఆదిత్య సీల్, భూమి పెడ్నేకర్, అనిత రాజ్, డినో మోరియా, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు సర్కిల్ లవ్ స్టోరీ అంటూ కూడా టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏ మేరకు ప్రేక్షకులను ఈ కాన్సెప్ట్ ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఎంతోమంది హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి బాలీవుడ్ ఇండస్ట్రీ రకుల్ కు ఎలాంటి స్టార్ స్టేటస్ ను అందిస్తుందో చూడాలి.