Pradeep Ranganathan:లవ్ టుడే మూవీతో హీరో గానే కాక దర్శకుడిగా కోలీవుడ్, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు నటుడు ప్రదీప్ రంగనాథన్. డబ్బింగ్ చిత్రాలు డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేసిన తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్. హీరో గానే కాక ఆయనే దర్శకుడుగా మారి సినిమాలను నిర్మించడం విశేషం. ఆయన తీసిన సినిమాలు తెలుగులోనూ సక్సెస్ ని అందుకుంటున్నాయి. 2022లో వచ్చిన లవ్ టుడే మూవీ తమిళ్ లోనే కాక తెలుగులోనూ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ప్రదీప్ రంగనాథన్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ మూవీ విశేషాలు చూద్దాం..
డ్యూడ్ మూవీ రిలీజ్ డేట్ లాక్..
సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆదరించేది తెలుగు సినీ ప్రేక్షకులు. నిర్మాతలు కూడా వారికి క్రేజ్ ఉంది అంటే, వారు తెలుగు ఇండస్ట్రీ హీరోనా పక్క ఇండస్ట్రీ హీరోనా, దర్శకుడు అని లేకుండా వారిని తెలుగులో పరిచయం చేయడానికి రెడీ అవుతుంటారు. గత కొంతకాలంగా సూర్య, ధనుష్, శివ కార్తికేయన్, లాంటి తమిళ హీరో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం మనం చూసాం. ఇప్పుడు అదే కోవలోకి మరో కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ తన కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే లవ్ టుడే మూవీ ని తెలుగులోను డబ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మొదటి సినిమా కన్నా ఎక్కువ సక్సెస్ ని అందుకుంది. దాదాపు ఈ రెండు సినిమాలు ప్రదీప్ రంగనాథన్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ గా చేరాయి. తెలుగులో తమిళ్ హీరో కి ఈ స్థాయిలో ఆదరణ రావడం విశేషం. ఈ రెండు చిత్రాలు 100 కోట్లు పైగా వసూలు చేశాయి. ఇప్పుడు తాజాగా ప్రదీప్ తో ప్రముఖ బడ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఓ సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ మూవీ పేరు డ్యూడ్. ఈ చిత్రానికి కీర్తి స్వరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మమత బైజు నటిస్తున్నారు. ఈ చిత్రానికి న్యూ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించడం విశేషం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2025లో దీపావళి పండక్కు రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రదీప్ కొత్త మూవీ డ్యూడ్ తో తెలుగు ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేస్తాడు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నా వారికి గట్టి పోటీ ఇస్తూ.. కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మూవీస్ ని తెలుగులోకి విడుదల చేయడం అవి ఇక్కడ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం, నిజంగా గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్.
తెలుగు హీరోలకు పోటీ ఇస్తున్న తమిళ్ హీరో ..
యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఎంతోమంది హీరోలు నటిస్తున్నా, వారి సినిమాలతో పోటీపడి, ప్రదీప్ రంగనాథన్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి ఊచకోత కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ గా పిలిచే మైత్రి మూవీ మేకర్స్ లోనే తన నాలుగవ సినిమా రానుండడం విశేషం. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలే. మరోసారి ఆయనతో కొత్త మూవీ డ్యూడ్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా చిత్రా షూటింగ్ పూర్తయినట్టు కీర్తి శెట్టి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Telugu Movie : సినిమా లాభాలు సైనికులకే… తెలుగు ప్రొడ్యూసర్ సంచలన నిర్ణయం
https://x.com/MythriOfficial/status/1921122325132710202?t=PJmnRO_LssFLm3OzPKuCyw&s=08