Trolls on Vamsi Posani: వైసీపీ నేతలకు జైలు భయం పట్టుకుందా? అలా వెళ్లారో లేదో అనారోగ్య సమస్యలు చుట్టేస్తున్నాయి. దీనితో ప్రస్తుత సీఎం చంద్రబాబు జైలు జీవితం తెరపైకి వచ్చింది. కేసులో పేరు లేకున్నా, చివరన చంద్రబాబు పేరు చేర్చి అక్రమంగా జైలుకు పంపించిన మీకు, మీ నేతలకు జైలు అంటేనే భయం వేస్తుందా అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీపై తెలుగు తమ్ముళ్లు విమర్శలు కురిపిస్తున్నారు.
సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్ 9న నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లిన సిఐడి అధికారులు అరెస్ట్ చేసి, రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 74 ఏళ్ల వయస్సు గల ఏకంగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. 53 వ రోజు జైలు నుండి బెయిల్ పై బాబు విడుదలయ్యారు.
తన జైలు జీవితంపై ఓ టీవీ షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని చెప్పుకొచ్చారు. చివరకు టాబ్లెట్ కూడా ఇచ్చే స్థితి తనకు లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నాటి వైసీపీ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు కోసం ప్రత్యేక వైద్యబృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అరెస్ట్ ను ఖండిస్తూ నిరసనల పర్వం సాగింది.
అయితే కూటమి అవతరించడానికి బాబు జైలు దోహదపడిందని చెప్పవచ్చు. అక్కడే పవన్ కళ్యాణ్ కూటమితో ఎన్నికలకు వస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబును జైలులో చూసి తన మనస్సు ఎంతగానో ఆవేదన చెందిందని, రానున్న ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని పవన్ చెప్పారు. అలాగే కూటమి ఎన్నికల్లో 164 స్థానాల్లో విజయాన్ని అందుకొని రికార్డ్ సృష్టించింది.
అయితే 74 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యలు ఉన్నా చంద్రబాబు జైలులో మిన్నకుండిన పరిస్థితి. జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు కాస్త బరువు కూడా తగ్గారని అప్పట్లో ప్రచారం సాగింది. వయస్సు పైబడినా జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు తనలో ఉన్న ఆవేదన బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, తన మనవడు దేవాన్ష్ ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
బాబు జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీలో ఉన్న పోసాని చేసిన కామెంట్స్ చూస్తే.. జైలుకు వెళితే దోమలు కుడతాయి.. అలాగే ఉండాలి.. ఒక ఏడాది ఉంటే సరిపోతుందన్నారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మేల్యే వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ తీరే వేరు. తప్పు చేశారు.. జైలుకు వెళ్లారు.. టీడీపీ అధికారంలోకి రావడమా.. అంతలేదనే తరహాలో కామెంట్స్ చేసిన విషయాన్ని ప్రస్తుతం టీడీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు.
నాడు బాబు జైలు జీవితం, నేడు వంశీ, పోసాని కృష్ణమురళిల జైలు జీవితాలను పోల్చుతూ.. సోషల్ మీడియాలో విమర్శలు కురుస్తున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన వెంటనే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పలు సదుపాయాలు కల్పించాలని జైలు అధికారులను కోరారు. వంశీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు జైలులో పలు సౌకర్యాలు కల్పించారు. నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అయితే జైలుకు వెళ్లిన కొన్ని గంటల్లోనే అనారోగ్య పాలయ్యారు. అసలే గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న పోసానికి వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Also Read: Sharmila on AP Budget: అప్పులతో అమరావతి.. వైఎస్ షర్మిళ సంచలన ట్వీట్
ఇలాంటి పరిస్థితిని 74 ఏళ్ల వయస్సులో నాడు చంద్రబాబు ఎలా ఎదుర్కొన్నారో ఇప్పటికైనా గుర్తించండి అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. మీకైతే జైలు అంటేనే భయం వచ్చేస్తుంది, నాడు ఎందుకిలా ఆలోచించ లేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద వంశీ, పోసానిలు జైలుకు వెళ్లగా చంద్రబాబు జైలు జీవితం తెరమీదికి తెచ్చి ఇది న్యాయమా అంటూ వైసీపీపై తెలుగు తమ్ముళ్లు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.