Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈయన ఎవరు.. ? అంటే టక్కున చెప్పలేకపోవచ్చేమో ఇప్పుడు కనుక పృథ్వీరాజ్ సుకుమారన్ ఎవరు అంటే.. టక్కున సలార్ సినిమాలో నటించిన నటుడు అని చెప్పుకొచ్చేస్తారు. అంతలా ఆయనను తెలుగు ఫ్యాన్స్ అక్కున చేర్చుకున్నారు. ఇక మలయాళంలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన హీరో మాత్రమే కాదు.. డైరెక్టర్, నిర్మాత కూడా. ఒక్క ఏడాదిలో దాదాపు 5, 6 సినిమాలు పృథ్వీరాజ్ సుకుమారన్ నుంచే వస్తాయి అంటే అతిశయోక్తి కాదు.
పాన్ ఇండియా వచ్చాకా .. భాషతో సంబంధం లేకుండా పోయింది. అక్కడ సినిమాలు ఇక్కడ.. ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులు కథ నచ్చితే ఆదరిస్తున్నారు. ఇక సలార్ లో నటించిన హీరోగా మాత్రమే పృథ్వీరాజ్ సుకుమారన్ చాలామందికి తెలుసు. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు దర్శకత్వం వహించింది ఈ హీరోనే. అంతేనా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ సినిమాకు దర్శకత్వం మాత్రమే కాదు నిర్మించింది కూడా పృథ్వీరాజ్ సుకుమారనే. ప్రస్తుతం లూసిఫర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు.
Sivakarthikeyan: పరాశక్తి.. శివకార్తికేయన్ ఈసారి శివతాండవమే
మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ 2..మార్చి 27 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా పింక్ విల్లా అనే బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటిస్తున్న సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఇక గత కొన్నిరోజులుగా SSMB 29 లో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SSMB 29. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ చిత్రంలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇక వీరితో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
” మీరు SSMB 29 లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి.. ?” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ” నాకంటే మీడియాకే ఎక్కువ సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు ఏది క్లారిటీ రాలేదు. చర్చలు అయితే జరుగుతున్నాయి. నన్ను సంప్రదించడం అయితే జరిగింది. అవి ఫైనల్ అయ్యాక మాట్లాడుకుందాం” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో కచ్చితంగా పృథ్వీరాజ్ సుకుమారన్ SSMB29 లో నటిస్తున్నట్లే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇది కాకుండా తెలుగులో సలార్ 2 లో కూడా నటిస్తున్నట్లు తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పుకొచ్చాడు.