Priya Banerjee -Prateik Babbar : ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అలా తాజాగా సౌత్,నార్త్ లో ఫేమస్ అయినటువంటి ప్రియా బెనర్జీ(Priya Banerjee) కూడా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. మరి ఇంతకీ ప్రియా బెనర్జీ ఎవరిని పెళ్లి చేసుకుంది..? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రియా బెనర్జీ కెనడాలో పుట్టి, పెరిగినప్పటికీ.. ఇండియాకి చెందిన అమ్మాయే.ఈమె తండ్రి ప్రియా పుట్టక ముందే కెనడాకు వెళ్లడంతో అక్కడే పెరిగింది. అలా సినిమాల మీద చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రియా బెనర్జీ మోడలింగ్ ద్వారా పలు యాడ్స్ లో నటించి, చివరికి తెలుగులో అడివి శేష్ (Adivi shesh) హీరోగా చేసిన కిస్ (Kiss) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న ప్రియా బెనర్జీ..
ఆ తర్వాత జోరు, అసుర వంటి తెలుగు సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అలా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో రాణించిన ప్రియా బెనర్జీ తాజాగా నటుడు ప్రతీక్ బబ్బర్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ప్రతీక్ బబ్బర్-ప్రియా బెనర్జీ(Prateik Babbar-Priya Banerjee) ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రియా బెనర్జీ పెళ్లి చేసుకున్న ప్రతీక్ బబ్బర్ కి ఇది రెండో పెళ్లి. ఆయన ముందుగా సన్యా సాగర్ ని 2019లో పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్ళైన ఏడాదికే విడాకులు తీసుకొని, 2023లో ఈ విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టాడు. చాలా రోజుల నుండి ప్రతీక్ బబ్బర్ – ప్రియా బెనర్జీలు ప్రేమలో ఉండి ఎట్టకేలకు ఈ జంట కుటుంబ సభ్యులను ఒప్పించి, 2025 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రియా బెనర్జీ ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ ప్రతీక్ బబ్బర్ (Prateik Babbar) ఫ్యామిలీ మాత్రం కనీసం ఈ పెళ్లికి కూడా రాలేదు.
వరుడి బంధువులకు ఈ పెళ్లి ఇష్టం లేదా..?
అయితే ఈ విషయంపై ప్రతీక్ బబ్బర్ సోదరుడు ఆర్య బబ్బర్ మాట్లాడుతూ.. మాకు అసలు పెళ్లి అనే విషయం చెప్పలేదని తెలియజేశాడు. కానీ ఈయన మాటలపై ప్రతీక్ సోదరి జూహి మాత్రం..” నా తమ్ముడు పెళ్లికి పిలవకపోయినా వాడి జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మొదటి పెళ్లి ద్వారా వాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.కానీ ఇప్పుడు అలా కాకూడదని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియా చాలా మంచి అమ్మాయి ” అంటూ తమ్ముడి పెళ్లి గురించి స్పందించింది. ఇక ప్రతీక్ బబ్బర్ పేరెంట్స్ కూడా నటీనటులే.. తండ్రి రాజ్ బబ్బర్, తల్లి స్మితా పాటిల్.. అయితే స్మితా పాటిల్ ని పెళ్లి చేసుకునే కంటే ముందే రాజ్ బబ్బర్ కి నాదిరా తో పెళ్లయింది. ఇక రాజ్ బబ్బర్ స్మితా పాటిల్ ని పెళ్లి చేసుకున్నాక ప్రతీక్ బబ్బర్ పుట్టారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతీక్ తల్లి ఆయన పుట్టిన కొద్ది రోజులకే మరణించింది. ఈ విషయం పక్కన పెడితే..ప్రియా బెనర్జీ (Priya Banerjee) కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకోవడంతో జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ప్రియా బెనర్జీ – ప్రతీక్ బబ్బర్ ల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలా మంది సెలబ్రిటీలు విషెస్ తెలియజేస్తున్నారు.