Sarangapani jathakam:ప్రియదర్శి (Priyadarshi) .. ఒకప్పుడు పలువురు హీరోల చిత్రాలలో కమెడియన్ గా నటించి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈయన.. ఇప్పుడు వైవిద్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ హీరోగా తనపై అంచనాలను రోజురోజుకు పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవలే కోర్ట్ (Court) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) దర్శకత్వంలో శివ లెంక కృష్ణ ప్రసాద్ (Shivalenka Krishna Prasad) నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన ఈయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
డైరెక్టర్ తో ఫోటో దిగితే చాలనుకున్నా – ప్రియదర్శి..
ఈ కథలోకి మీరు ఎలా వచ్చారు..? అసలు ఈ చిత్రంతో ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు..? అని ఒక విలేకరు ప్రశ్నించగా.. దానికి ప్రియదర్శి బదిలిస్తూ.. నేను దర్శకుడు ఇంద్రగంటితో ఒక ఫోటో దిగితే చాలు అనుకునేవాన్ని.. అలాంటిది ఆయనే ఒక రోజు నాకు ఫోన్ చేసి ఒక సినిమా ఉంది మనం చేద్దాం అని చెప్పాడు. దాంతో వెంటనే ఒకే చెప్పేశాను. ఇది జాతకాల పిచ్చోడి కథ.. టైటిల్ సారంగపాణి జాతకం అనుకుంటున్నామని చెప్పగానే అద్భుతంగా ఉంది అనిపించింది. ఇక ఆయనతో నా మొదటి రోజు షూటింగు ఎప్పటికీ మర్చిపోలేను. అసలు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాదు అనుకున్న నాకు ఆయనే అవకాశం ఇచ్చాడు అంటే ఇక అప్పుడే నేను సక్సెస్ అయ్యాను అనిపించింది. ఈ చిత్రం ద్వారా జాతకాలను నమ్మండి అని కానీ, నమ్మొద్దు అని కానీ మేము చెప్పడం లేదు. ఒకరి నమ్మకాలను ఇంకొకరిపై రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే విషయాన్ని మాత్రమే చూపించాలి అనుకున్నాము అంటూ ప్రియదర్శి తెలిపారు.
నాని రూట్ లో ప్రియదర్శి..
ప్రియదర్శి మాట్లాడుతూ.. ఇకపోతే ఈ సినిమాను ముందుగానే ప్రీమియర్ల రూపంలో ప్రేక్షకులకు చూపించబోతున్నాము. అందుకే “నచ్చితేనే థియేటర్లకు రండి” అని చెప్పబోతున్నాం అంటూ ప్రియదర్శి తెలిపారు. ఇకపోతే ప్రియదర్శి ఈ కామెంట్లు చేయడంతో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ముఖ్యంగా కోర్ట్ సినిమాకు నానితో కలిసి ప్రయాణం చేశాడు కదా.. అందుకే ఇప్పుడు నాని ఆలోచనలని ప్రియదర్శి వర్కౌట్ అయ్యేలా చేస్తున్నారు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. నాని కూడా కోర్టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో..” నా ‘హిట్ 3’ సినిమా చూడకపోయినా పర్లేదు ఈ సినిమా చూడండి” అంటూ ఒక కొత్త స్ట్రాటజీని అప్లై చేశాడు. ఇంకా ఆయన చెప్పినట్టుగానే కోర్ట్ సినిమా చిన్న సినిమాగా వచ్చినా .. మంచి కలెక్షన్స్ వసూలు చేసి అందరి మనసులు దోచుకుంది. ఇక ఆయనతో చేసిన ప్రయాణం అలాంటి ఆలోచనలనే ప్రియదర్శి పాటిస్తున్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే ప్రీమియర్ నచ్చితేనే థియేటర్లకు రండి అని చెప్పబోతున్నామంటూ ఇప్పుడు తెలిపారు. మరి నాని బాటలో ప్రయాణిస్తున్న ప్రియదర్శికి ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. మరి సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఏప్రిల్ 25 వరకు ఎదురు చూడాల్సిందే.
ALSI READ:HBD Nag Ashwin: డాక్టర్ కావాల్సినవాడు డైరెక్టర్ ఎలా అయ్యారు.. సక్సెస్ స్టోరీ వెనుక ఇంత కథ ఉందా..?