Celebs Insurance : సినిమా ఇండస్ట్రీలో తరచుగా కాపీ వివాదాలు తలెత్తడం చూస్తూనే ఉంటాం మనం. ఇవన్నీ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి, లేదంటే హక్కులు, మ్యూజిక్ కు సంబంధించిన వివాదాలే. కానీ ఎప్పుడైనా సెలబ్రిటీల బాడీ పార్ట్స్ లా లేదా వాళ్ళ నవ్వు, వాయిస్ వంటివి కాపీ కొడితే, ఆ కాపీ వివాదం వల్ల లేనిపోని వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఎప్పుడైనా విన్నారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది నిజమే.
కొంతమంది సెలబ్రిటీలు తమ శరీర భాగాలకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. ఒకవేళ ఎవరైనా వాళ్ళలా కాపీ కొట్టాలని చూస్తే ఖచ్చితంగా ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుంది. నిజానికి సెలబ్రిటీలు తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి చాలా కష్టపడతారు. అందుకే తమలో ప్రత్యేకంగా కనిపించే చిరునవ్వు, వాయిస్, బాడీ పార్ట్స్ వంటి వాటికి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. పైగా వాటిపై కాపీ రైట్స్ కూడా వాళ్ళకే చెందేలా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి పొరపాటున అలాంటి పని చేసినా చిక్కుల్లో పడ్డట్టే.
ఇక ఈ లిస్టులో బాలీవుడ్ నుంచి మొదలు పెడితే హాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. టాలీవుడ్ నుంచి ఇలాంటి ట్రెండును ఇంకా ఎవరూ మొదలు పెట్టలేదు. కానీ బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్ వంటి వారు ఇలాంటి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మరి ఏ సెలబ్రిటీ దేనికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారో తెలుసుకుందాం పదండి.
ప్రియాంక చోప్రా (Priyanka Chopra)
ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా గురించే. ప్రియాంకకు తన చిరునవ్వు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె తన చిరునవ్వుపై కాపీ రైట్స్ ను తీసుకుంది. కాబట్టి ఎవరైనా సరే సర్జరీ చేయించుకుని ప్రియాంకలా చిరునవ్వు నవ్వాలి అంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez)
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ తన హిప్ కి భీమా చేయించుకున్నారు. జెన్నిఫర్ తన శరీరంలో హైలెట్ అయిన హిప్ భాగానికి ఆమె ఇన్సూరెన్స్ చేయించుకుంది.
మల్లికా షెరావత్ (Mallika Sherawat)
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన శరీరం మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. చూడగానే మత్తెక్కించే అందాలతో కన్పించే మల్లికా ఇప్పటికీ యూత్ హాట్ ఫేవరెట్.
లతా మంగేష్కర్ (Lata Mangeshkar)
మ్యూజిక్ నైటింగేల్ లతా మంగేష్కర్ తన కెరీర్‌లో చాలా పాటలు పాడారు. తన మధురమైన స్వరానికి ఆమె ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కాబట్టి ఎవ్వరూ ఆమె వాయిస్ ను కాపీ కొడుతూ పాటలు పాడడానికి ట్రై చేయకపోవడమే మంచిది.
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)
బాలీవుడ్ షహెన్ షా అమితాబ్ బచ్చన్ వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వాయిస్ కు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే కొంతమంది ఆయన వాయిస్ ను వాడుకోవాలని ప్రయత్నించడంతో అమితాబ్ తన వాయిస్‌ని ఎవరూ కాపీ కొట్టకుండా కాపీరైట్ రైట్స్ ను పొందాడు.
జాన్ అబ్రహం (John Abraham)
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ‘దోస్తానా’ చిత్రంలోని ఒక పాటలో తన హిప్ ని ప్రదర్శించి, ఫుల్ పాపులర్ అయ్యాడు. అందుకే జాన్ తన హిప్ కి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు.