BigTV English

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Priyanka Chopra : దేశి బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హాలీవుడ్‌ లో అద్భుతంగా రాణిస్తోంది. అయితే హాలీవుడ్ కు వెళ్లాడానికంటే ముందు ప్రియాంక బాలీవుడ్‌లో చాలా సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించి, స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ పై హిందీ సీనియర్ నటుడు అన్ను కపూర్ (Annu Kapoor) చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.


ప్రియాంకా చోప్రా లీడ్ రోల్‌ పోషించిన హిందీ చిత్రం ‘సాత్ ఖూన్ మాఫ్’ (Saat Khoon Maaf). ఏడుగురు భర్తలున్న మహిళ పాత్రను పోషించిన ప్రియాంక ఇందులో ఒకరి తర్వాత మరొకరిని చంపేస్తుంది. ఇందులో ప్రియాంకతో పాటు నీల్ నితిన్ ముఖేష్, ఇర్ఫాన్ ఖాన్, అన్నూ కపూర్ (Annu Kapoor) వంటి పలువురు ప్రముఖ నటులు కనిపించారు. ఈ సినిమాలో అన్నూ కపూర్‌తో ప్రియాంక లవ్, కెమిస్ట్రీని కూడా సినిమాలో చూపించారు. ఆయన ప్రియాంక కు ఐదో భర్తగా నటించగా, ఇద్దరి మధ్య బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ పాడ్ కాస్ట్ లో ప్రియాంక చోప్రా పాపులర్ నటుడు అన్నూ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తనతో ముద్దు సన్నివేశానికి ప్రియాంకా (Priyanka Chopra) వెనకడుగు వేసిందని, డైరెక్టర్ విశాల్ భరద్వాజ్‌ తన దగ్గరకు వచ్చి బోల్డ్‌ కిస్సింగ్ సీన్‌లో నటించడానికి ప్రియాంక అసౌకర్యంగా ఫీలవుతుందని చెప్పి, ఆ సన్నివేశాన్ని మార్చేశారని చెప్పుకొచ్చారు. ‘నేను హీరోగా ఉంటే ప్రియాంక చోప్రాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. హీరోని ముద్దుపెట్టుకోవడానికి ఏ హీరోయిన్ కి అభ్యంతరం లేదు’ అంటూ అన్నూ కపూర్‌ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అన్నూ కపూర్ (Annu Kapoor) ఎందుకు అంతగా ఏడుస్తున్నావ్ ? ఛాన్స్ మిస్ అయినట్లుంది అని ఓ నెటిజన్ కామెంట్స్ చేస్తే,  గొప్ప వ్యక్తులు ఎప్పుడూ ఇలాగే ఉంటారని  నెటిజన్ సెటైర్ వేశారు.


బాలీవుడ్ లో రొమాంటిక్ సన్నివేశాల ఘాటు ఎక్కువగానే ఉంటుంది. సౌత్ తో పోలిస్తే గ్లామర్ షో, లిప్ లాక్ సీన్స్ వంటి మసాలా సన్నివేషాలు బాలీవుడ్ లో ఎక్కువగా కన్పిస్తాయి. అయితే ఈ సీనియర్ నటుడు ఏకంగా తనతో ముద్దు సీన్ చేయడానికి ప్రియాంక చోప్రా నిరాకరించింది అంటూ చేసిన కామెంట్స్ ఆయనకే తిప్పి కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రియాంక తోప్రా (Priyanka Chopra) ఇటీవల ముంబైకి వచ్చింది. అయితే ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చిందని అభిమానులు భావించారు. కానీ ఏదో ప్రాజెక్ట్‌కి సంబంధించి వచ్చి కొన్ని రోజులకే మళ్లీ వెళ్ళిపోయింది. ఇక్కడున్న టైమ్ లో తన ప్రొడక్షన్ హౌస్‌లో చేసిన మరాఠీ చిత్రం ‘పాణి’ ట్రైలర్ లాంచ్‌లో కూడా పాల్గొంది. ఇప్పుడు ఆమె వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ రెండవ సీజన్ షూటింగ్‌లో బిజీగా ఉంది. దీనికి ముందు ‘బ్లఫ్’ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. ప్రియాంక కిట్టిలో వీటితో పాటు అనేక ఇతర పెద్ద హాలీవుడ్ ప్రాజెక్ట్‌ లు కూడా ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×