Sachin Tendulkar: టీమిండియా మాజీ క్రికెటర్ , లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటి చేత్తో టీమిండియా కు ఎన్నో విజయాలు అందించారు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. క్రికెట్ గాడ్ గా కూడా సచిన్ టెండూల్కర్ కు పేరు ఉంది. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) … ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ లో ఉన్న సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) … ఓ అరుదైన రికార్డు దక్కింది.
Also Read: IND-W vs WI-W: వెస్టిండీస్ తో వన్డే సిరీస్.. క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా జట్టు
అరుదైన రికార్డ్ అనేకంటే గౌరవం అని చెప్పవచ్చు. మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ లో ( Melbourne Cricket Club) ప్రతిష్టాత్మక గౌరవం సచిన్ టెండుల్కర్ కు దక్కింది. ఈ మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ లో గౌరవ సభ్యుడిగా సచిన్ టెండూల్కర్ కు ( Sachin Tendulkar) అవకాశం కల్పించారు. ఈ ఆఫర్ ను ముందుగా మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ( Melbourne Cricket Club) ఆఫర్ చేసింది. అయితే వాళ్లు చేసిన ఆఫర్ ను… లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తిరస్కరించలేదు. వెంటనే వాళ్ళ గౌరవ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేశారు సచిన్ టెండూల్కర్. దీంతో… మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ లో గౌరవ సభ్యుడిగా సచిన్ టెండూల్కర్ కు ( Sachin Tendulkar) స్థానం దక్కింది. అయితే దీనిపై మేల్ బోర్న్ క్రికెట్ క్లబ్ స్పందించింది.
తమ ఆఫర్ ను సచిన్ టెండూల్కర్… స్వీకరించినందుకు గాను…. స్వాగతిస్తున్నట్లు పోస్ట్ పెట్టింది మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ( Melbourne Cricket Club) . క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను సచిన్ టెండుల్కర్ ఈ అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది ఎంసిసి. ఇక ఆయన క్లబ్బులో మెంబర్ కావడం గర్వకారణంగా ఉందని తెలిపింది. అయితే ఇప్పటివరకు మేల్ బోర్న్ స్టేడియంలో ఐదు టెస్టులు ఆడాడు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) . ఇందులో 58.49 స్ట్రైక్ రేట్ తో 449 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు సచిన్ టెండూల్కర్.
Also Read: Virat Kohli: అభిమానులతో కోహ్లీ వాగ్వాదం.. వీడియో వైరల్!
అయితే ఈ సేవలు అన్ని గుర్తించిన మెల్బోర్న్ క్రికెట్ క్లబ్… ఆయనకు సభ్యత్వాన్ని కల్పించింది. ఇలా మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లో ( Melbourne Cricket Club) … స్థానం దక్కడంతో సచిన్ టెండూల్కర్ రికార్డు లోకి ఎక్కాడు. ఇలాంటి అవకాశం కొంతమంది క్రికెటర్లకు మాత్రమే వస్తుంది. అవకాశం సచిన్ టెండూల్కర్ కు ( Sachin Tendulkar) రావడం ఇండియాకి గర్వ కారణం అని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.
ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం నాలుగో మ్యాచ్ మేల్ బోర్న్ స్టేడియం లోనే జరుగుతోంది.