Priyanka Chopra: ప్రముఖ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె షారుక్ ఖాన్ (Shahrukh Khan) తో ప్రేమాయణం.. రంగంలోకి ఆయన భార్య గౌరీ ఖాన్ (Gauri Khan) దిగడం.. ఆఖరికి తన ఇండస్ట్రీ స్నేహితులతో కలిసి అవకాశాలు లేకుండా చేయడం వల్లే.. బాలీవుడ్ ని వదిలి హాలీవుడ్ కి వెళ్లిపోయిందని అక్కడి జనాలు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రియాంక చోప్రాకి బాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వకపోవడానికి అసలు కారణం మాత్రం ఇప్పటికీ తెలియదనే చెప్పాలి. కానీ ఈమధ్య బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా మాత్రం కొన్ని శక్తులు తనకు అవకాశాలు లేకుండా చేశాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఎస్ ఎస్ ఎం బి 29 లో ప్రియాంక..
బాలీవుడ్ లో అవకాశాలు రాకపోయేసరికి అవమానంగా ఫీల్ అయ్యి హాలీవుడ్ కి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడే తన నటనతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.45 నుండి రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.అక్కడ గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. అందులో భాగంగానే రాజమౌళి (Rajamouli) , మహేష్ బాబు (Maheshbabu) కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ SSMB -29లో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఈ విషయం తెలిసి అందరూ ప్రియాంకకు ఇదే తొలి తెలుగు సినిమా అని కామెంట్లు చేస్తుండగా.. ఇది నిజం కాదని దాదాపు 25 ఏళ్ల క్రితమే ఈమె తెలుగు సినిమా చేయాల్సి ఉండగా.. అనుకోని కారణాలవల్ల అది మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం.
25 ఏళ్ల క్రితమే ఎంట్రీ..
అసలు విషయంలోకి వెళ్తే.. 1982 జూలై 18న జంషెడ్పూర్ లో జన్మించిన ఈమెది మిలిటరీ నేపథ్య కుటుంబం. తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు.. ఇద్దరూ కూడా ఇండియన్ ఆర్మీలో డాక్టర్లుగా పనిచేసేవారు.. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ఎన్నో ప్రాంతాలు తిరగడంతో చిన్నతనంలోనే దేశమంతా చుట్టేసింది ప్రియాంక. 13 ఏళ్ల వయసులోనే పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఈమె అక్కడ కోరల్ సింగింగ్, క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకుంది. 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు అదే ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ కూడా గెలుచుకుంది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు చుట్టుముట్టడంతో అప్పటికే ఓ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఆమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. ఒప్పందం తరువాత బాబీ డియోల్, అక్షయ్ ఖన్నా హీరోలుగా నటించిన ‘హంరాజ్’ సినిమాలో ఈమెకు తొలి అవకాశం వచ్చినా.. సడన్గా ఈమెను తప్పించి అమీషా పటేల్ ను తీసుకున్నారు. దాంతో ఆమె మొదటి అరంగేట్రం సౌత్ నుండి జరిగింది.2002లో హీరో విజయ్ పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది. ఇదే ఆమె తొలి సినిమా కూడా…ఆ తర్వాత తెలుగు నిర్మాతల ఆమెపై ఆసక్తి చూపించారు. అలా ‘అపురూపం’ పేరుతో సాయిరవి డైరెక్షన్లో ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో ప్రసన్న హీరో. అయితే అప్పట్లో అత్యంత మోస్ట్ బిజీ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న శ్రీదేవి డేట్స్ ను ఆ చిత్ర నిర్మాత నెక్కంటి ఏదోలాగా దక్కించుకోవడంతో సడన్గా ప్రియాంకను తప్పించారు. అయితే ఈ సినిమా కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకుని ఆర్థిక కారణాలవల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఈమె మరో తెలుగు సినిమాకు సైన్ చేయకుండా బాలీవుడ్ అక్కడి నుండి హాలీవుడ్ కి వెళ్లి ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఇన్నేళ్లకు అవకాశాన్ని అందుకుంది. ఒకవేళ ఆ రోజే పూర్తి అరంగేట్రం జరిగిపోయింది ఉంటే.. అపురూపం సినిమా ఈమె తెలుగు మొదటి సినిమా అయ్యుండేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.