BigTV English

Priyanka Mohan: 2023లోనే షూటింగ్ అయిపోయింది.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక మోహన్

Priyanka Mohan: 2023లోనే షూటింగ్ అయిపోయింది.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక మోహన్

Priyanka Mohan: ఎన్నో ఏళ్లుగా చాలామంది హీరోలు స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ అందులో సక్సెస్ సాధించిన హీరోల సంఖ్య చాలా తక్కువ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్నా.. రాజకీయాల్లోకి వెళ్లాలని, ప్రజలకు సేవ చేయాలని కలలు కన్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసినా కూడా ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన విఝయం ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచింది. రాజకీయాల గురించి పక్కన పెడితే సినిమాల విషయంలో మాత్రం ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. తాజాగా ఆయన అప్‌కమింగ్ మూవీ ‘ఓజీ’ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటపెట్టింది ప్రియాంక మోహన్.


క్లారిటీ ఇచ్చేసింది

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవుతారని తెలిసినా కూడా పలు ప్రాజెక్ట్స్‌ను సైన్ చేశారు. అంతే కాకుండా వాటన్నింటికి సంబంధించిన షూటింగ్స్‌ను కూడా ప్రారంభించారు. అప్పుడే ఏపీలో ఎన్నికలు మొదలయ్యాయి. అందులో ఆయన ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆచన అప్‌కమింగ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ రానుందని ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఇక ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాల్లో ఆయన అవసరం మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన అప్‌కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో వారికి ఒక క్లారిటీ ఇచ్చింది ప్రియాంక మోహన్.


Also Read: శోభితను చైతన్యకు పరిచయం చేసింది ఆయనేనా?

అదే ఆశిస్తున్నాను

ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ ‘ఓజీ’పైనే ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్.. పవన్ కళ్యాణ్‌ను ఎలా చూపిస్తాడా అని వారంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ‘ఓజీ’ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి పవన్ ఇంకా రాజకీయాల్లో యాక్టివ్ కాకపోవడంతో పలు షెడ్యూల్స్‌ను వేగంగా పూర్తిచేశారు. సగం షూటింగ్ పూర్తయ్యిందని అప్పట్లో మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక మిగతా షూటింగ్ గురించి తాజాగా ప్రియాంక మోహన్ ఒక అప్డేట్‌ను అందించింది. ‘‘నా షూటింగ్ అంతా గతేడాదే పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపింది.

మన మనిషి

ఇటీవల రానా హోస్ట్‌గా ప్రారంభమయిన సరికొత్త టాక్ షో ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show)లో నాని, ప్రియాంక మోహన్ గెస్టులుగా వచ్చారు. ఆ ఎపిసోడ్‌లో వారు ఎన్నో పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడుకున్నాను. అందులో భాగంగానే ‘ఓజీ’ అప్డేట్ షేర్ చేసుకుంది ప్రియాంక మోహన్ (Priyanka Mohan). ఇక రానా (Rana) కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈసారి ఏపీ ఎన్నికలు ఒక సినిమాలాగా ఉన్నాయని అన్నాడు. నాని (Nani) దీనిపై స్పందించాడు. ‘‘పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నప్పుడు స్క్రీన్‌పై ఒక పర్సనాలిటీలాగా అనిపించేది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మన మనిషి అనిపిస్తోంది’’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×