A.M Ratnam: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న తర్వాత నటీనటులు రాజకీయాలలోకి (Politics)వచ్చి, రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుత సెలబ్రిటీల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఇదే కోవకు చెందుతారు. పవన్ కళ్యాణ్ నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకొని అనంతరం జనసేన పార్టీని (Janasena Party)స్థాపించి రాజకీయాలలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న సంగతి తెలిసిందే.
పవన్ అడుగుజాడల్లోనే…
ఇకపోతే పవన్ కళ్యాణ్ ను రాజకీయాల పరంగా స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు జనసేన పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే మరొక బడా ప్రొడ్యూసర్ కూడా సినిమాలను వదిలేసి రాజకీయాలలోకి వెళ్ళబోతున్నారా? అంటే అవును అనే తెలుస్తోంది. సినీ నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఏ ఎం రత్నం(A.M Ratnam) ఒకరు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ త హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కోరిక…
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎ ఏం రత్నం రాజకీయాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.. తాను హరిహర వీరమల్లు పార్ట్ 1,2 విజయవంతంగా పూర్తి అయిన తరువాత రాజకీయాలలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నానని, ఆయన అడుగుజాడల్లోనే నడవాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత ఎన్నికలలో పోటీ చేయడం లాంటివి కాకుండా పార్టీ కోసం కష్టపడుతూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ఎ. ఏం రత్నం తెలిపారు.
#HariHaraVeeraMallu Part 1 and part 2 teesi Nenu PawanKalyan gari pakane undi Janasena kosam pani chesthanu and party ni strengthen chesthanu.
Ayana chala successful ayyi inka best position ki veltharu#HHVM ee Ayana career lo biggest budgeted film. Ayana regular ga chese 30-40… pic.twitter.com/lNUWFWnShK
— Sharat chandra (@Sharatsays2) June 1, 2025
జనసేన పార్టీ కోసం కష్టపడుతూ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. పవన్ కళ్యాణ్ దాదాపు ముఖ్యమంత్రి అయినట్టేనని, ప్రజలు ఆయనపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఏదో ఒక రోజు కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇలా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఎ .ఏం రత్నం రాజకీయాలలోకి వచ్చి పవన్ తోనే ఉంటానంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది నిర్మాతలు, హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా పూర్తిస్థాయిలో వారి మద్దతు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన కమిట్ అయిన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. తనకు వీలైనప్పుడల్లా సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ షూటింగులను పూర్తి చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి కావడంతో జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.