OTT Movie : కామెడీ జానర్లో ఒక ఎనర్జిటిక్ లవ్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కామెడీని జత చేసి తెరకెక్కించారు. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఈ మూవీ బాగా అలరించింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
ఆర్జే విక్రమ్ (అశ్విన్ కుమార్) అనే యువకుడు, అంజలి (అవంతిక మిశ్రా) అనే రచయిత్రితో నిశ్చితార్థం చేసుకుంటాడు. అంజలికి ఒక ప్రత్యేకమైన కోరిక ఉంటుంది. గతంలో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండి, లవ్ లో ఫైల్ అయిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే అలాంటి భగ్న ప్రేమికుడికి మాత్రమే ప్రేమ విలువ బాగా తెలుస్తుందని నమ్ముతుంది. కానీ విక్రమ్‌కు గతంలో ఎలాంటి ప్రేమ అనుభవం ఉండదు. ఆమెను ఆకట్టుకోవడానికి గతంలో ఒక అమ్మాయిని ప్రేమించి ఫైల్ అయ్యానని ఒక అబద్దపు స్టోరీని చెబుతాడు. అంజలి ఈ స్టోరీని నమ్మి దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీని గురించి ఒక పుస్తకం రాయడానికి విక్రమ్ మాజీ ప్రియురాలిని కలవాలని అనుకుంటుంది. ఇప్పుడు విక్రమ్, తన స్నేహితుడు చిట్టి సహాయంతో, తన కల్పిత మాజీ ప్రియురాలి పాత్రను పోషించడానికి ఒక అమ్మాయిని వెతుకుతాడు.
దీని కోసం అతను ప్రీతి అనే థియేటర్ ఆర్టిస్ట్‌ను కలుస్తాడు. ఆమె ఈ పాత్రను పోషించడానికి అంగీకరిస్తుంది. కానీ బదులుగా విక్రమ్ ని కూడా తన తాత దగ్గర ప్రియుడిగా నటించాలని కోరుతుంది. ఎందుకంటే ఆమెను తొందరగా పెళ్లి చేసుకోమని తన తాత ఒత్తిడి చేస్తుంటాడు. ఈ క్రమంలో వీళ్ళు పాత ప్రేమికులుగా నాటిస్తారు. అయితే స్టోరీ ఇక్కడ టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు విక్రమ్, ప్రీతి ఒకరిపట్ల ఒకరు అభిమానం పెంచుకుంటారు. విక్రమ్, ప్రీతి ఒకరిపట్ల ఒకరికి ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసుకుంటుంది అంజలి. చివరికి విక్రమ్ ఎవరిని లవ్ చేస్తాడు ? అంజలి, విక్రమ్ ప్రేమ కథను పుస్తకంగా రాస్తుందా ? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడిదాకా వెళ్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ అమ్మాయిది మామూలు లక్కు కాదు సామీ… మైండ్ బ్లోయింగ్ కథ ఇది
జీ 5 (Zee 5) లో
ఈ తమిళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ఎన్నా సొల్ల పోగిరాయ్’ (Enna Solla Pogirai). 2022 లో విడుదలైన ఈ తమిళ సినిమాకు ఎ. హరిహరన్ దర్శకత్వం వహించారు. ఇందులో అశ్విన్ కుమార్, లక్ష్మీకాంతన్, తేజు అశ్విని, అవంతిక మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. పుగళ్, దిల్లీ గణేష్, సుబ్బు పంచు, స్వామినాథన్ సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ జీ 5 (Zee 5) ఓటీటీలో 2022 ఏప్రిల్ 15 నుండి అందుబాటులో ఉంది