Kane Williamson- PSL: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ( Kane Williamson ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్… ఐపీఎల్, న్యూజిలాండ్ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడి.. ఎన్నో విజయాలు అందించాడు. అయితే.. అలాంటి న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. ఇప్పుడు పాకిస్థాన్ లీగ్ లోనూ అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
Also Read: Punjab kings Captains: ఇదేం కర్మ రా.. 17 మంది కెప్టెన్స్ మారారు..కానీ తలరాత మారలేదు ?
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 డ్రాఫ్ట్‌లో ( Pakistan Super League ) న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ( Kane Williamson ) అన్ సోల్డ్ ప్లేయర్ గా ( unsold ) నిలిచాడు. సోమవారం అంటే జనవరి 13న లాహోర్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 ( Pakistan Super League ) డ్రాఫ్ట్ జరిగింది. అయితే.. ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 డ్రాఫ్ట్‌లో లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
దీంతో…కేన్ విలియమ్సన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో టీ20 ఫ్రాంచైజీల్లో స్థానం దక్కించుకోవడానికి కేన్ విలియమ్సన్ చాలా కష్టపడుతున్నాడు. కానీ కేన్ విలియమ్సన్ కు కష్టాలు తప్పడం లేదు. నవంబర్ 2024లో జరిగిన IPL 2025 మెగా వేలంలో కూడా అమ్ముడుపోలేదు కేన్ విలియమ్సన్. అయితే.. ఐపీఎల్ లో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిన డైనమిక్ డేవిడ్ వార్నర్ కు మాత్రం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 డ్రాఫ్ట్‌లో ( Pakistan Super League ) బంపర్ ఆఫర్ తగిలింది. డైనమిక్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ కొనుగోలు చేసుకుంది. దీంతో PSL డ్రాఫ్ట్ లో సోల్డ్ ప్లేయర్ గా డైనమిక్ డేవిడ్ వార్నర్ మిగిలాడు.
ఇటీవల కష్టతరమైన స్థితిని ఎదుర్కొంటున్నాడు కేన్ విలియమ్సన్. 34 ఏళ్ల బ్యాటర్ కేన్ విలియమ్సన్…. తక్కువ స్ట్రైక్ రేట్ తో పాటు, T20 ఫార్మాట్‌లో పెద్దగా రాణించడం లేదు. సంప్రదాయవాద ఆట తీరు ఫ్రాంచైజీ క్రికెట్‌లో పనికి రాదని.. కేన్ విలియమ్సన్ ను దూరం పెడుతున్నాయి ఫ్రాంచైజీలు. ఈ తరుణంలోనే… IPL 2025 మెగా వేలంతో పాటు… పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 డ్రాఫ్ట్‌లో ( Pakistan Super League ) న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ( Kane Williamson ) అన్ సోల్డ్ ప్లేయర్ గా ( unsold ) మిగిలాడని చెప్పవచ్చు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం ప్రకటించిన న్యూజిలాండ్ జట్టులో మాత్రం… కేన్ విలియమ్సన్ ( Kane Williamson ) కు స్థానం దక్కింది.
Also Read: South Africa Squad: ఏం గుండెరా అది.. బావుమా కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో సౌతాఫ్రికా !
No buyers for Kane Williamson 👀#IPL2025 #PSL2025 #KaneWilliamson #CricketTwitter pic.twitter.com/sxFhS17Z0M
— InsideSport (@InsideSportIND) January 13, 2025