BigTV English

Manchu Family: ఆస్తి తగాదాలు.. ఎలా ఉండే కుటుంబం.. ఎలా అయిపోయిందిరా

Manchu Family: ఆస్తి తగాదాలు.. ఎలా ఉండే కుటుంబం.. ఎలా అయిపోయిందిరా

Manchu Family: ఆ నలుగురు సినిమా గుర్తుందా.. ? అందులో రాజేంద్ర ప్రసాద్ నటనకే కాదు.. ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నిజం చెప్పాలంటే అవి డైలాగ్స్ కాదు. జీవిత సత్యాలు. “రూపాయి రూపాయి నువ్వేం చేస్తావ్  అని అడిగితే .. హరిశ్చంద్రుడు చేత అబద్దం ఆడిస్తాను. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను. తండ్రిబిడ్డలను విడదీస్తాను.  అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను. ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందంట” అని రాజేంద్ర ప్రసాద్ చెప్పిన డైలాగ్ గుర్తుందా. అది అక్షర సత్యం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


ఈ డబ్బు ఒక అందమైన ఫ్యామిలీని ముక్కలు చేసింది. తండ్రి మీద కొడుకు చెయ్యెత్తేలా చేసింది. తమ్ముడు ప్రాణం తీయడానికి అన్నను సిద్ధపడేలా చేసింది. ఒక స్టార్ హీరో కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మంచు మోహన్ బాబు. భక్తవత్సలం నాయుడు అనే ఒక పిటీ మాస్టర్ సినిమాలపై ఆసక్తితో మోహన్ బాబు అనే పేరు మార్చుకొని.. చిత్ర పరిశ్రమలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. నెమ్మదిగా హీరోగా ఎదిగి..  బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారి..  ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. మంచు లక్ష్మీ, మంచు విష్ణు. మొదటి భార్య చనిపోవడంతో ఆమె చెల్లినే ఆయన వివాహమాడాడు.  వారికి మంచు మనోజ్ జన్మించాడు. మొదటి నుంచి మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు అనే అందరికీ తెలుసు. అందరికీ ఒకే తల్లి అన్నట్లే పెరిగారు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరు  కొడుకులతోనే కనిపించేవాడు.  ఇక పండగ వచ్చిందంటే.. మంచు కుటుంబంలో సందడే సందడి.


Trinath Rao Nakkina: హీరోయిన్ సైజ్ ల గురించి మాట్లాడి తప్పు చేశా.. క్షమించండి

ముఖ్యంగా సంక్రాంతి వస్తే.. భోగి రోజు నుంచి కనుమ  వరకు..  ఇద్దరు కొడుకులు, కూతురు, చుట్టాలు, వారి కాలేజ్ లోని స్టూడెంట్స్ తో కలిసి చేసుకొనేవారు. లేకపోతే సొంత ఊరు వెళ్లి అక్కడ జరుపుకునేవారు.  అన్నదమ్ముల మధ్య లక్ష్మీ అల్లరి చేస్తూ కనిపించేది. ఇక ఈ సంతోషం అంతా ఇప్పుడు లేదు. పిల్లలు  పెరిగారు. వారికి పెళ్లిళ్లు అయ్యాయి. ఎవరి జీవితం వారు చూసుకున్నారు. ఇక పెళ్లిళ్లు అయ్యాక.. ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.

మంచు మనోజ్.. రెండో వివాహం ఇంట్లో ఎవరికి నచ్చలేదు. ఏదోలా పెళ్లి చేసుకున్న మనోజ్ పై అన్న విష్ణు పగబడ్డాడు. తండ్రీకొడుకుల మధ్య చిచ్చు పెట్టి.. తమ్ముడుని బయటకు గెంటేశాడు. ఆ తగాదాల్లోనే మోహన్ బాబు జర్నలిస్ట్ పై చెయ్యి చేసుకోవడం.. అది కేసు అవ్వడం, ఆయన పారిపోవడం ఇలా  చాలా  జరిగాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మోహన్ బాబు సంక్రాంతి సంబురాలను  జరుపుకోవడం కోసం అజ్ఞాతం వీడిన విషయం తెల్సిందే.

చంద్రగిరిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబాలు భోగీ పండగ జరుపుకున్నారు. ఇక మంచు మనోజ్ కుటుంబం వేరే చోట ఈ పండగను జరుపుకున్నారు. ఈ రెండు చోట్ల మంచు వారసురాలు లక్ష్మీ కనిపించలేదు. ఆమె ఎప్పుడో తన మకాన్నీ ముంబైకు మార్చిన విషయం తెల్సిందే. అన్నదమ్ములు కొట్టుకుంటున్న.. లక్ష్మీ అక్కడనుంచి రాలేదు. ఇలా మంచు ఫ్యామిలీ నాలుగు ముక్కలయ్యింది. ఇక ఇదంతా చూస్తున్న అభిమానులు.. ఎలా ఉండే కుటుంబం.. ఎలా అయిపోయిందిరా అంత డబ్బేరా అని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×