BigTV English

Robinhood: ‘రాబిన్‌హుడ్’లో క్యామియో కన్ఫర్మ్.. స్టేజ్‌పైనే లీక్ చేసిన నిర్మాత

Robinhood: ‘రాబిన్‌హుడ్’లో క్యామియో కన్ఫర్మ్.. స్టేజ్‌పైనే లీక్ చేసిన నిర్మాత

Robinhood: ఏ స్టార్ హీరో సినిమా అయినా అందులో సరైన క్యామియో ఉంటే ప్రేక్షకులు వాటిని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అందుకే సీనియర్ హీరోలు సైతం ఏరికోరి తమ సినిమాల్లో యంగ్ హీరోలతో క్యామియో చేయించుకుంటున్నారు. అలా కేవలం గెస్ట్ రోల్స్‌తోనే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే యంగ్ హీరో నితిన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. తన అప్‌కమింగ్ మూవీ కోసం ఏకంగా ఒక క్రికెటర్‌నే గెస్ట్ రోల్ కోసం రంగంలోకి దించుతున్నాడు నితిన్. ఆ విషయాన్ని దర్శకుడి పర్మిషన్ లేకుండా స్వయంగా స్టేజ్‌పైనే లీక్ చేశాడు నిర్మాత. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మేజర్ లీక్

వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘భీష్మ’ అనే సినిమా వచ్చింది. ఆ మూవీ మంచి కామెడీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నితిన్‌కు క్లీన్ హిట్ ఇచ్చింది. అందుకే తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతోనే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘రాబిన్‌హుడ్’ (Robinhood) అనే మరో కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలాకాలం అయినా కూడా ఇప్పటికీ దీని నుండి పూర్తిస్థాయిలో అప్డేట్స్ లేవు. అలాంటిది తాజాగా ఈ మూవీ నిర్మాత అయిన రవి శంకర్ దీనికి సంబంధించి ఒక మేజర్ లీక్ ఇచ్చారు.


నితిన్ ఓకే అన్నాడు

తాజాగా జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌స్టన్’ సినిమాకు సంబంధించిన తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు నితిన్‌తో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల కూడా పాల్గొన్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవి శంకర్ ఈ ఈవెంట్‌లో మాట్లాడడానికి స్టేజ్‌పై వచ్చినప్పుడు ‘రాబిన్‌హుడ్’ నుండి ఏదైనా లీక్ ఇవ్వమని యాంకర్ అడిగింది. ‘‘దీంట్లో ఒక క్యామియో క్యారెక్టర్ ఉంది’’ అని రవి శంకర్ స్టార్ట్ చేయగానే డైరెక్టర్ మాత్రం వద్దు అన్నట్టుగా తల ఊపాడు. కానీ నితిన్ మాత్రం చెప్పేయండి అంటూ మోటివేట్ చేయడంతో అసలు విషయం బయటపెట్టారు రవి శంకర్.

Also Read: ‘యానిమల్’ సీక్వెల్ నుండి మేజర్ అప్డేట్ లీక్.. సందీప్ మొత్తం రివీల్ చేశాడుగా.!

క్యామియో నిజమే

‘‘రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్ (David Warner) చిన్న క్యామియో చేశారు. మరీ మరీ అడిగారు కాబట్టి చెప్తున్నా. సారీ వెంకీ నీ పర్మిషన్ లేకుండా చెప్తున్నా. డేవిడ్ వార్నర్ చిన్న క్యారెక్టర్ చేశారు చాలా ఎగ్జైట్ అవుతాం చూసి. ఆయనను ఇండియన్ సినిమాలో లాంచ్ చేసే అవకాశం రాబిన్‌హుడ్‌కు దక్కడం చాలా హ్యాపీగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు రవి శంకర్. అయితే ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ క్యామియో చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ నుండి డేవిడ్ వార్నర్ షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అది అప్పట్లో తెగ వైరల్ కూడా అయ్యింది. మొత్తానికి రవి శంకర్ వల్ల ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×