Teacher MLC elections: వరంగల్- నల్గొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. తెలంగాణలోరెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆదిలాబాద్- నిజామాబాద్- కరీంనగర్-మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించగా.. వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి వియం సాధించారు.
ALSO READ: Teacher MLC elections: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం
వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 93.55 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 24,136 ఓట్లు పోలయ్యాయి. అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో.. ఎలిమినేషన్ విధానం కొనసాగించారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కరీంనగర్-అదిలాబాద్-మెదక్ -నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందిన విషయం తెలిసిందే.