Mayawati Nephew: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి తీసుకున్న ఇటీవల నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మాయావతి నిన్న (మార్చి 2) తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీలోని అన్ని ముఖ్యమైన పదవుల నుంచి తొలగించారు. ఇప్పుడు ( మార్చి 3న) మాయావతి ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
1. बीएसपी की आल-इण्डिया की बैठक में कल श्री आकाश आनन्द को पार्टी हित से अधिक पार्टी से निष्कासित अपने ससुर श्री अशोक सिद्धार्थ के प्रभाव में लगातार बने रहने के कारण नेशनल कोआर्डिनेटर सहित सभी जिम्मेदारियों से मुक्त कर दिया गया था, जिसका उसे पश्चताप करके अपनी परिपक्वता दिखानी थी।
— Mayawati (@Mayawati) March 3, 2025
గతంలో మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ పార్టీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. కానీ తాజాగా మాత్రం పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆనంద్‌ను తొలగించారు. అయితే మాయావతి నిర్ణయానికి కారణం ఏంటి, మేనల్లుడిపై నమ్మకం లేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా. లేదా పార్టీని తన చేతుల్లో ఉంచుకోవాలని ఇలా చేశారా అని పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాదు అసలు ఏమైందని, తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ పట్ల ఆమెకు ఎందుకంత ద్వేషమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత నెలలో మాయావతి ఆకాష్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు తన మేనల్లుడు ఆకాష్‌ను కూడా పార్టీ నుంచి వేటు వేశారు. ఈ క్రమంలో మాయావతి బతికి ఉన్నంత కాలం, తన పార్టీకి వారసుడు ఉండరని చేసిన ప్రకటన కూడా తెరపైకి వస్తుంది. బీఎస్పీ అధినేత నిర్ణయం గురించి రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి.
Read Also: Shahzadi Khan: పని చేయని తల్లిదండ్రుల విజ్ఞప్తి.. యూఏఈలో భారత మహిళకు ఉరిశిక్ష
అయితే ఆకాష్ ఆనంద్ వివాహం అయినప్పటి నుంచి అతని మామ, భార్య, అత్తమామల ప్రభావం ఎక్కువగా ఉందని మాయావతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఆకాష్ ఆనంద్ తన అత్తమామల నిర్ణయాల కారణంగా పార్టీపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నాడని అంటున్నారు. అతను పార్టీ ప్రయోజనాల కంటే తన మామ అశోక్ సిద్ధార్థ్ నిర్ణయాలకు పనిచేశాడని చెబుతున్నారు.
దీంతో మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అలా చేయడం ద్వారా పార్టీకి నష్టం కలిగించడమే కాకుండా, ఆకాశ్ ఆనంద్ రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నారని అనేక మంది ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించడానికి మాయావతి అధ్యక్షతన బీఎస్పీ ఓ సమావేశం నిర్వహించింది. ఈ విషయాలు తెలుసుకున్న మాయావతి ఆకాష్ పై చర్యలకు సిద్ధమైంది. చివరకు అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
BSP బాధ్యతల నుంచి తొలగించబడిన తర్వాత ఆకాష్ ఆనంద్ xలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. “నేను అత్యంత గౌరవనీయమైన మాయావతి క్యాడర్‌ని, ఆమె నాయకత్వంలో త్యాగం, విధేయత అంకితభావం వంటి అనేక పాఠాలు నేర్చుకున్నాను. ఇవన్నీ నాకు ఒక ఆలోచన మాత్రమే కాదు. ఆమె ప్రతి నిర్ణయం నాకొక మైలురాయి లాంటిది. నేను ఆమె ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీలోని అన్ని పదవుల నుంచి నన్ను తొలగించాలని మాయావతి తీసుకున్న నిర్ణయం నాకు వ్యక్తిగతంగా భావోద్వేగంగా ఉంది. కానీ అదే సమయంలో ఇది ఒక పెద్ద సవాలు కూడా” అని పేర్కొన్నారు.