Animal Park: ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయితే దానికి కచ్చితంగా సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ అనుకుంటున్నారు. హిట్ అయినా, ఫ్లాప్ అయినా సీక్వెల్‌కు ఛాన్స్ ఉండేలా సినిమాలను తెరెక్కిస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్స్‌తో పాటు ఫ్రాంచైజ్‌ల ట్రెండ్ కూడా ప్రారంభమయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా తను తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ ‘యానిమల్’కు ఫ్రాంచైజ్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చాలాకాలం క్రితమే మాటిచ్చాడు. ముందుగా ‘యానిమల్’కు సీక్వెల్‌గా తెరకెక్కే సినిమాకు ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు. ఇక తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన మేజర్ లీక్‌ను స్వయంగా బయటపెట్టాడు సందీప్.
నిజాన్ని ఒప్పుకున్నాడు
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమానే ‘యానిమల్’. ఈ సినిమా 2023 డిసెంబర్‌లో విడుదలయ్యి సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. ఈ మూవీలో ఉన్న వైలెన్స్‌ను నిరసిస్తూ చాలామంది దీనిని బాయ్‌కాట్ చేశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఈ సినిమాను మళ్లీ మళ్లీ థియేటర్లలో చూసి హిట్ చేసి ప్రేక్షకులు కూడా ఉన్నారు. దర్శకుడిగా సందీప్ అసలు ఇలాంటి వైలెంట్ సినిమాను ప్రేక్షకులకు ఎలా అందించాడు అని తనపై కూడా విమర్శలు వచ్చాయి. కానీ తను అవేమీ పట్టించుకోలేదు. తాజాగా ‘యానిమల్’ సినిమాలో లాజిక్ లేని సీన్స్ గురించి ఈ దర్శకుడు మాట్లాడాడు. అలాంటి సీన్స్ ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నాడు.
పోలీసులు లేరు
‘‘సినిమా తెరకెక్కించడానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అందులో లాజిక్స్ ఉండవు’’ అని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ముఖ్యంగా ‘యానిమల్’లో హీరో అయిన రణబీర్ కపూర్ వందల మందిని ఇష్టం వచ్చినట్టు చంపుతూ ఉంటే పోలీసులు ఏమైపోయారు అని ప్రేక్షకులు విమర్శించారు. దానిపై సందీప్ స్పందించాడు. ‘‘పోలీసులు ఉండాల్సిన చోట ఉన్నారు. వాళ్లను ఈ సీన్స్ మధ్యలోకి తీసుకురావాలని నేను అనుకోలేదు. నేను కావాలనే ఫోకస్ అంతా రణబీర్‌పై పెట్టాను. మధ్యలో పోలీసులను తీసుకొచ్చి, వారితో సీన్స్ యాడ్ చేస్తే ప్రేక్షకుల అటెన్షన్ డైవర్ట్ అవుతుంది’’ అంటూ తను అలాంటి సీన్స్ పెట్టడంపై మాట్లాడాడు సందీప్ రెడ్డి వంగా.
Also Read: ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అలాంటి కష్టాలు.. మొదటిసారి నోరువిప్పిన షాలిని పాండే
పార్ట్ 2లోనే
‘యానిమల్’ (Animal)లో పోలీసులు లేకపోయినా.. ‘యానిమల్ పార్క్’ (Animal Park)లో పోలీసులకు సంబంధించిన సీన్స్ ఉంటాయని లీక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ‘‘నేను రాసుకున్న కథలో ఒక సీబీఐ ఆఫీసర్ ఉన్నాడు. కానీ తనను నేను పార్ట్ 2లో చూపించాలని అనుకున్నాను. అందుకే ఫస్ట్ పార్ట్‌లో యాడ్ చేయలేదు. ఒక సీబీఐ ఆఫీసర్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వెంటపడతాడు. పార్ట్ 2లో తనను ఒక సర్‌ప్రైజ్‌లాగా దింపుతాను’’ అని సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేశాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అయితే ఆ సీబీఐ ఆఫీసర్ పాత్రలో ఎవరు కనిపిస్తారా అని ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ పాత్ర కోసం ఎవరైనా స్టార్ హీరోను దింపితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.