Pawan Kalyan film with Surender Reddy : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా ఏడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన పవన్ కళ్యాణ్ జానీ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్లు వరుస ప్లాప్ సినిమాలు చూశాడు. మామూలుగా ఎవరికైనా సినిమా డిజాస్టర్ అయితే మార్కెట్ తగ్గుతూ వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఒకవైపు మార్కెట్ పెరగడంతో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా ఒకరకంగా కారణమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలు మీద డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించేది. కరాటే నేర్చుకోవడం, కార్లు కింద చేతులు పెట్టడం, ఛాతి పై బండరాళ్లు పగలగొట్టించుకోవడం ఇవన్నీ కూడా చాలామందికి అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒక రీమేక్ సినిమా చేసిన కూడా దానిలో పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ కనిపించేది. అందుకే ఖుషి లాంటి సినిమా కూడా ఒరిజినల్ కంటే తెలుగులోనే ఎక్కువ హిట్ అయింది.
వరుసగా ప్లాప్ సినిమాలు పడిన తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ను మిస్ అయిన ఎనర్జీ అంతటినీ కూడా ఈ సినిమాలో చూపించాడు హరీష్. అలానే హరీష్ అంటే డైలాగ్స్ కు పెట్టింది పేరు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడా పర్ఫెక్ట్ డైలాగ్స్ రాశాడు. “నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది” “నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను” ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సెట్ అవుతాయి. ఈ సినిమా కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నిలిచింది. మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమా కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయింది.
Also Read : DilRaju’s reaction to RakeshVarre’s Comments : సెలబ్రిటీస్ రారమ్మ, ఎందుకు వస్తారు.. ఎవరి బిజీ వాళ్ళది
త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఈవెంట్ అయినా కూడా వీరిద్దరూ కనిపిస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీ అయిపోయిన తర్వాత సినిమాలను పూర్తిస్థాయిలో వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ త్రివిక్రమ్ చెప్పడం వలన వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వడంతోనే చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వాటిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా ఒకటి ఉంది. అయితే మిగతా సినిమాల అప్డేట్స్ వచ్చాయి గాని ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్ రాలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు గురించి నోరు విప్పారు నిర్మాత రామ్ తల్లూరి (Ram Talluri). ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడో అయిపోయిందట. పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా నచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా అవుతుంది అని నాకు నమ్మకాలు లేవు అంటూ తెలిపాడు రామ్. ఇక రామ్ నిర్మాతగా వ్యవహరించిన మెకానిక్ రాకి సినిమా త్వరలో రిలీజ్ కానుంది.