Telugu star actors : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది నటులు కష్టపడి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ వంటి ఎంతోమంది నటులు ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న చాలామంది దర్శకులు చిరంజీవిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే. చాలామంది నటులు కూడా మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంట్రీ ఇచ్చారు. ఒకరకంగా ఇది గర్వించదగ్గ విషయం. అయితే రోజులు మారుతున్న కొద్దీ ఇప్పటివరకు సాధించిన పేరును తమకు తాముగానే పోగొట్టుకుంటున్నారు కొంతమంది సెలబ్రిటీస్ అని చెప్పాలి. ముఖ్యంగా పదిమంది మధ్యలో బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నోటి నుంచి మాట బయటకు వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము.
నోరు జారిన సందర్భాలు..
గతంలో బాలకృష్ణ ఒక సినిమా ఆడియో లాంచ్ కు హాజరైనప్పుడు మాట్లాడిన మాటలు తీవ్రమైన దుమారాన్ని రేపాయి. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టేయాలి, లేకపోతే కడుపున చేయాలి అంటూ ఒక స్టార్ హీరో అనడం అనేది తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ఆ తర్వాత బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా క్షమాపణలు కూడా తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే పలు సందర్భాలలో అనుకోకుండా నోరు జారిపోయారు. ఒకసారి బ్రహ్మానందం ని ఉద్దేశిస్తూ ఎర్రిపు**** ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు అంటూ మళ్ళీ కవర్ చేయాల్సిన పరిస్థితి. అలానే పలు సందర్భాలలో పేరు కూడా తప్పు చెబుతూ ఉంటారు.
రాజేంద్రప్రసాద్ కాంట్రవర్సీ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాజేంద్రప్రసాద్ ఒకడు. ఎన్నో సినిమాలు తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు తీవ్రమైన చర్చలకు దారితీసాయి. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే వేడుకల్లో ఆలీని ఒక బూతు పదం వాడి పిలవడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా కమలహాసన్ మాట్లాడిన మాటలు తీవ్రమైన చర్చలకు దారితీసాయి. ముఖ్యంగా కన్నడ భాష గురించి మాట్లాడిన మాటలు అయితే నెక్స్ట్ రేంజ్ వెళ్ళిపోయాయి. అలానే ఇళయరాజా వంటి సంగీత దర్శకుడు కూడా తన గురించి గొప్పగా చెప్పుకునే ప్రాసెస్ లో తనను మించిన వారు లేరు అనడం కూడా కొంతమందికి నచ్చలేదు.
జాగ్రత్త వహించాల్సిందే
ఇకపోతే ఎన్నో కష్టాలు ఎదుర్కొని, సినిమాలు చేసి, తమకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకున్న ఈ సెలబ్రిటీలు ప్రస్తుత కాలంలో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడకపోవడం కూడా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు సంపాదించుకున్న పేరు అంతా కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాల వలన దెబ్బతింటుంది. ఇప్పటికైనా ఈ దిగ్గజ సెలబ్రిటీలు కళ్ళు తెరుచుకొని విషయాన్ని గమనించి జాగ్రత్త పడాలి.
Also Read : Kamal Haasan : జగమొండి… ఈగోతో సినిమానే రిలీజ్ చేయడం లేదు