Puri Jagannadh: సినీ పరిశ్రమలో ఏ ఇద్దరి మధ్య అయినా గొడవలు జరగడం కామన్. కానీ వారు కాస్త దూరంగా ఉన్నా వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, గొడవలు జరిగాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. అలాగే గత కొన్నిరోజులుగా పూరీ జగన్నాధ్, చార్మీ రిలేషన్ డిస్టర్బ్ అయ్యిందని, వీరిద్దరూ దూరం అయిపోయారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలిగిపోయిన చార్మీ.. ఇప్పుడు పూర్తిగా పూరీ జగన్నాధ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో బిజీ అయిపోయింది. అలాంటిది ఒక నిర్మాణ సంస్థ కోసం పనిచేస్తున్న వీరిద్దరూ విడిపోయారనే వార్తలు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఉగాది సందర్భంగా ఈ రూమర్స్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది.
నిజంగా దూరమయ్యారా?
పూరీ జగన్నాధ్, చార్మీ కలిసి పూరీ కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థలో ఇతరుల సినిమాలు నిర్మించకపోయినా పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసే సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వస్తున్నారు. అలా ఈ బ్యానర్‌పై హిట్లు ఎన్ని ఉన్నాయో.. ఫ్లాపులు కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. దీంతో నిర్మాతలుగా పూరీ, చార్మీ తమ వైఖరిని మార్చాలని ప్రేక్షకులు సైతం సలహాలు ఇస్తూ ఉన్నారు. పూరీ కనెక్ట్స్ నుండి బ్యాక్ టు బ్యాక్ డిశాస్టర్లు రావడంతో డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్ సక్సెస్ అవ్వాలంటే చార్మీని దూరం పెట్టాల్సిందే అని చాలామంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఇంతలోనే వీరు దూరం అయిపోయారు అని వార్తలు వచ్చాయి.
అదిరిపోయే కాంబో
పూరీ జగన్నాధ్, చార్మీ (Charmme) విడిపోయారు అని మాత్రమే కాదు.. గత కొన్నిరోజులుగా మరొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతితో పూరీ జగన్నాధ్ సినిమా చేయనున్నాడని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఉగాది సందర్భంగా ఈ రెండు విషయాలపై ఒకేసారి క్లారిటీ ఇచ్చేశారు పూరీ, చార్మీ. వీరిద్దరూ కలిసి పూరీ కనెక్ట్స్ ద్వారా విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ‘ఈ ఉగాది సందర్భంగా ఒక సెన్సేషనల్ కాంబోతో అదిరిపోయే కొత్త చాప్టర్‌లోకి అడుగుపెడుతున్నాం’ అంటూ పూరీ కనెక్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఈ కాంబో సినిమాపై ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
Also Read: ప్రదీప్ జీవితంలో కష్టాలు.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
పెద్ద విషయమే
పూరీ జగన్నాధ్ (Puri Jagannadh), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా మరెన్నో ఇండియన్ భాషల్లో కూడా విడుదల కానుందని ఇప్పుడే ప్రకటించేసింది టీమ్. జూన్ నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా తెలిపింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రతీ భాషలో ఆయన మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అలాంటి తను ఫ్లాప్స్‌లో ఉన్న పూరీ జగన్నాధ్‌కు నమ్మి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద విషయమని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన గత రెండు సినిమాలు డిశాస్టర్లుగా నిలిచాయి.
On this auspicious day of #Ugadi ✨🙏🏻
Embarking on an electrifying new chapter with a sensational collaboration 🔥Dashing Director #PuriJagannadh and powerhouse performer, Makkalselvan @VijaySethuOffl join forces for a MASTERPIECE IN ALL INDIAN LANGUAGES ❤️🔥
Produced by Puri… pic.twitter.com/Hvv4gr0T2Z
— Puri Connects (@PuriConnects) March 30, 2025