Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘పేడే సేల్’ లో భాగంగా విమాన ప్రయాణానికి ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తోంది. ప్రత్యేక సేల్‌లో భాగంగా విమాన టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ లో భాగంగా ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఛార్జీలు కేవలం రూ.1,499 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే చెక్-ఇన్ బ్యాగేజీ లేని ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు రూ.1,429 నుండి ప్రారంభమవుతాయి. ప్రయాణికులు తక్కువ ధరలో ప్రయాణించే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ www.airindiaexpress.com లో లాగిన్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది . ఈ సేల్ మార్చి 28 నుండి మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వాారా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణించాలి.
ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు..
ఈ ఆఫర్ కింద, వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీతో.. ప్రయాణికులకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా 3 కేజీల క్యారీ-ఆన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు, చెక్-ఇన్ బ్యాగేజీపై ప్రత్యేక తగ్గింపులు కూడా ప్రకటించారు. ఇందులో దేశీయ విమానాలకు 15 కేజీల బ్యాగేజీ రూ.1,000, ఇంటర్నేషనల్ విమానాలకు అయితే 20 కేజీల బ్యాగేజీ రూ. 1,300లకి అందుబాటులో ఉంచారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో లాయల్టీ సభ్యులుగా ఉన్న ప్రయాణీకులకు ఈ సేల్‌లో మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. బిజినెస్ క్లాస్ వంటి సౌకర్యవంతమైన ఎక్స్‌ప్రెస్ బిజ్ సీట్లపై ప్రయాణికులు ప్రత్యేక తగ్గింపులు పొందుతారు. దీంతో పాటు, హాట్ ఫుడ్, సీట్ల ఎంపిక, ప్రాధాన్యతా సేవలు, అదనపు చెక్-ఇన్ బ్యాగేజీ, క్యారీ-ఆన్ బ్యాగేజీపై కూడా తగ్గింపులు లభిస్తాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన నెట్‌వర్క్‌ను వేగంగా వ్యాపింపజేస్తోంది. ఇటీవల, ఎయిర్‌లైన్ తన 100వ విమానాన్ని ప్రారంభించింది. గత రెండేళ్లలో విమానాల సంఖ్యను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ ఎయిర్‌లైన్ భారతదేశం, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియాలోని 54 నగరాలను 500 కంటే ఎక్కువ విమానాల ద్వారా కలుపుతోంది.
దీంతో పాటు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ హిండన్ విమానాశ్రయం నుంచి ప్రయాణించిన మొదటి అలాగే ఏకైక విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇక్కడ నుండి బెంగళూరు, చెన్నై, గోవా, కోల్‌కతా, ముంబైకి నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, మార్చి 30 నుంచి భువనేశ్వర్, ఏప్రిల్ 1 నుంచి వారణాసికి కూడా సేవలు ప్రారంభమవుతున్నాయి.
ALSO READ: Group-1 Results: పండుగ పూట గ్రూప్-1 అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. జనరల్ ర్యాకింగ్స్ విడుదల
ALSO READ: Girls Boyfriend: అమ్మాయిలూ.. ఇలాంటి అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన