BigTV English

Puri Jagannadh: డ్యాషింగ్ డైరెక్టర్ సినీ జర్నీ @25 ఏళ్లు.

Puri Jagannadh: డ్యాషింగ్ డైరెక్టర్ సినీ జర్నీ @25 ఏళ్లు.

Puri Jagannadh: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన జీవితాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించాడు. శివ, నిన్నే పెళ్లాడుతా, చిత్రాలలో పనిచేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయి, అమీషా పటేల్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాథ్ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ భారీ హిట్స్ ని అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీకి వచ్చి పాతిక సంవత్సరాలు అయిన సందర్భంగా డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మరికొంత లోతుగా చూద్దాం..


అగ్రహీరోలతో పూరి సినిమాలు ..

టాలీవుడ్ అగ్ర డైరెక్టర్ లలో పూరి జగన్నాధ ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. మహేష్ బాబు హీరోగా 2006లో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోకిరి సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలో రీమిక్స్ చేయబడి దేశవ్యాప్తంగా పూరి జగన్నాధకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికే పూరి జగన్నాథ్ 40 కి పైగా సినిమాల్లోకి దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, దేశముదురు ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పూరి తన సొంత నిర్మాణ సంస్థలలో అనేక సినిమాలో నిర్మించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ అకాడమీ, పూరీ కన్వెన్షన్ నటి చార్మితో కలిసి అనేక నిర్మాణ సంస్థల ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. పూరి, లావణ్య ఇద్దరిదీ ప్రేమ వివాహం. పూరి జగన్నాథ్ 2024లో హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. ఆయన కొడుకు ఆకాష్ తో సినిమాను రూపొందించారు. విజయ్ దేవరకొండ తో టైగర్ సినిమాను నిర్మించారు. బద్రి మొదలు 2024 లో వచ్చిన డబల్ ఇస్మార్ట్ శంకర్ వరకు ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. పోకిరి, బిజినెస్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ఊ సృష్టించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు, దేశముదురు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పాయి.


25 సంవత్సరాల సినీ ప్రస్థానం ..

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ నటుడిగా మెహబూబ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన కొడుకు ఆకాష్ తోనే తన సొంత బ్యానర్ లో వాస్కోడిగామా సినిమాను పూరి జగన్నాథ్ రూపొందించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా యాక్షన్ మూవీని సిద్ధం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండతో జనగణమన సినిమాను నిర్మిస్తున్నాడు. పూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఇది రెండవ సినిమా. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పూరి సినిమాలో నటించిననున్నాడు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి విజయాలను అందుకున్నాడు. ఆయన సినిమాలో స్పీడు చూసి ఒక్కొక్క సమయాలలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా పూరి వైపు చూసి ఆశ్చర్యపోయేవారు. హీరో ఎంత వారైనా సరే సినిమాను కొన్ని నెలల్లోనే పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్ చేసే వారు. ఆయన సినిమాల బడ్జెట్ సైతం నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చే విధంగా ఉండేది. పూరి సినిమాలను ఇష్టపడే వారు ఎక్కువ ఆయన సినిమాలు వస్తుందంటేనే హీరోతో సంబంధం లేకుండా అంచనాలను పెంచేసుకుంటారు అభిమానులు. పాతిక సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఆయన సినిమాల ఎంత సక్సెస్ అవుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే.. ఆయన తీసిన సినిమాలలోని సీన్స్, డైలాగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. పోకిరి సినిమాలో డైలాగు ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. పూరి తన కొటేషన్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. పూరి జగన్నాథ్ నుంచి మరిన్ని సినిమాలు రావాలని మరో బ్లాక్ మాస్టర్ హిట్ సినిమాతో ఆయన సక్సెస్ ని అందుకోవాలని మనసారా కోరుకుందాం..

 

Samantha:సడన్ గా తిరుమలలో ప్రత్యక్షమైన సమంత… ఎందుకోసం అంటే..?

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×